చర్చకు రావాలని మోదీకి చిదంబరం ‘సవాలు’

చర్చకు రావాలని మోదీకి చిదంబరం ‘సవాలు’

న్యూఢిల్లీ: నూతన పౌరసత్వ చట్టం పై వస్తున్న విమర్శలను ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ చర్చ ఒక్కటే మార్గమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి. చిదంబరం పేర్కొన్నారు. నూతన చట్టం పౌరసత్వం ఇచ్చేందుకే తప్ప తీసి వేయ డానికి కాదని చెబుతున్న మాటలను నమ్మని విమర్శకులతో ప్రధాని మోదీ కనీసం చర్చలు జరపడం లేదని విమర్శించారు. ‘భారీ వేదికల మీద నుంచి మౌనంగా కూర్చున్న వారితో ప్రధాని సీఏఏపై మాట్లాడుతున్నారు. ఎవరి నుంచీ ఒక్క ప్రశ్న కూడా వినటం లేదు. కానీ మేము మాధ్యమాలతో మాట్లాడుతూ, ఆ ప్రతినిధుల ప్రశ్నలకు బదులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని చిదంబరం ట్వీట్ చేశారు. సీఏఏపై విమర్శలు ఎదుర్కునేందుకు ప్రధాని మోదీ లైవ్లో చర్చకు రావడమే పరిష్కారమని ఆయన సూచించారు. ‘‘విస్తృత అవగాహన ఉన్న ఐదుగురు విమర్శకులను ఎంపిక చేసి, వాళ్లతో ప్రధాని మోదీ బహిరంగ చర్చకు రా వా లి. వాళ్లు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఆ చర్చను ప్రజలంతా చూసి, తమ సందేహాలు నివృత్తి చేసుకునే అవకా శం ఇవ్వాలి. ఈ ప్రతిపాదనకు ప్రధాని మోదీ అంగీకరిస్తారని నమ్ముతున్నాన’ ని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos