ముంబయి చేరుకున్న వలసకార్మికులు

ముంబయి చేరుకున్న వలసకార్మికులు

ముంబై : లాక్డౌన్తో సొంతూళ్లకు వెళ్లిన వలసకార్మికులు మళ్లీ నగరానికి వస్తున్నారు. లాక్డౌన్ సడలించటంతో కర్మాగారాలు, మెట్రో ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. దీంతో స్వగ్రామాలకు వెళ్లిన వారిలో సుమారు ఐదున్నర లక్షల మంది తిరిగి ముంబయికి చేరుకున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. అత్యధికులు ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్కు చెందిన వారు. లాక్డౌన్ లో మహారాష్ట్ర నుంచి 844 రైళ్లలో 18 మంది లక్షల మంది కార్మికులు స్వస్థలాలకు తరలిపోయారు. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 5 లక్షల మంది వచ్చినట్లు పశ్చిమ రైల్వే ప్రధాన పౌర సంబంధాల అధికారి ఆఫీసర్ రవీంద్ర ప్రభాకర్ తెలిపారు. ప్రత్యేక రైళ్లు నడిపినప్పుడు 70 శాతం సీట్లు మాత్రమే నిండాయని, ఇప్పుడు వందకు వంద శాతం సీట్లు రిజర్వ్ అవుతున్నాయని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos