మళ్లీ తెర పైకి మార్గదర్శి కేసు

మళ్లీ తెర పైకి మార్గదర్శి కేసు

న్యూఢిల్లీ : రిజర్వు బ్యాంకు నియమాలకు వ్యతిరేకంగా పౌరుల నుంచి ధరావత్తులు సమీకరించారని మార్గదర్శి ఫైనాన్షి యర్స్కు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యంపై అత్యు న్నత న్యాయ స్థానం మళ్లీ దృష్టి సారించింది. ఈ కేసులో ఆంధ్రప్ర దే శ్నూ ప్రతివాదిగా చేర్చాలని నిర్ణయించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ చైర్మన్ రామోజీరావును కేసు నుంచి విడుదల చేయటాన్ని సవాల్ చేస్తూ లోక్ సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గతంలో దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయస్థానం శుక్రవారం విచారణ జరిపింది. అనంతరం ఉండవల్లి అరుణ్ కుమార్, న్యాయవాది ఎస్ఎస్ ప్రసాద్ కుమార్ విలేఖరులతో మాట్లాడా రు .‘చట్టం ముందు అందరూ సమానులే. ఏదో ఒక వంకతో స్టేలు తెచ్చుకొని కేసు నుంచి తప్పించుకోవాలని రామోజీరావు ప్రయ త్ని స్తున్నారు. కేసులో కేవలం తెలంగాణను మాత్రమే ప్రతివాదిగా చేర్చారు. ఆంధ్రప్రదేశ్ను కూడా చేయాలన్న మా విజ్ఞప్తిని న్యాయస్థానం స్వీకరించింది. ఉమ్మడి రాష్ట్రంలోనే వారు రూ.2300 కోట్ల వసూలు చేశారు. నేను ఊహించిన దాని కంటే ముం దు గా సుప్రీం కోర్టు స్పందించింది. ఆంధ్రప్రదేశ్ను, అప్పటి విచారణాధికారి కృష్ణంరాజును కక్షిదార్లు చేశారు. డిపాజిట్లు వెనక్కి ఇచ్చినని చెప్పినంత మాత్రాన క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆగిపోవు. నిబంధనల ప్రకారం విచారణ జరగాలి. కేసులో దోషిగా తేలితే వసూలు చేసిన దానికి రెండున్నర రెట్లు జరిమాన, రెండున్నరేళ్ల జైలు శిక్ష విధిస్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos