తల్లిదండ్రులను పోషించుకోవడానికి అమ్మాయి వేషం..

తల్లిదండ్రులను పోషించుకోవడానికి అమ్మాయి వేషం..

వృద్ధులైన తల్లితండ్రులను పోషించుకోవడానికి తమిళనాడు రాష్ట్రం శివగంగై జిల్లాకు చెందిన ఓ యువకుడు పడుతున్న పాట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.సినిమాను తలపించే రీతిలో యువకుడు పడుతున్నట్లు పాట్లు చూసి కొంతమంది హర్షం వ్యక్తం చేస్తుంటే మరికొంత మంది విమర్శిస్తున్నారు.అయితే చాలా శాతం మంది యువకుడి చర్యను సమర్థిస్తున్నారు. చెందిన రాజా అనే వ్యక్తి వృద్ధులైన తల్లితండ్రులను పోషించుకోవడానికి ప్రతిరోజూ శివగంగై జిల్లా మానామదురై గ్రామం నుంచి బస్సులో మధురై చేరుకునేవాడు.మధురైలొ బస్సు దిగిన వెంటనే ఎవరూ కనిపించని ప్రదేశంలో లుంగీ, షర్ట్ విప్పేసి తలకు విగ్ ధరించి మహిళ వేషం వేస్తాడు. రాజాత్తిగా పేరు మార్చుకొని అమ్మాయి వేషంలో ఇళల్లో పాచి పనులు చేస్తుంటాడు.పనులు ముగిసిన వెంటనే తిరిగి రహస్య ప్రాంతానికి చేరుకొని అక్కడే మళ్లీ వేషం మార్చి షర్టు,లుంగీతో గ్రామానికి చేరుకుంటాడు.ఇలా ఆరు నెలలుగా అమ్మాయి వేషంలో పాచి పనులు చేస్తూ తల్లితండ్రులను పోషించుకుంటున్నాడు.అయితే వ్యక్తి మహిళగా వేషం మార్చుకొని ఇళ్లల్లో పాచిపనులు చేస్తుండడాన్ని గమనించిన కొంతమంది ఫోటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేయడంతో వైరల్‌గా మారాయి.కొంతకాలంగా అతడి వేషాలను చూస్తున్న ప్రాంత ప్రజలు తాజాగా అతడిని పట్టుకుని నిలదీశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన పేరు రాజా అని, రాజాత్తిగా పేరు మార్చుకుని ఇంటి పనులు చేస్తున్నానని చెప్పడంతో వారు షాకయ్యారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పోషించుకునేందుకు ఇంతకుమించిన మార్గం కనిపించలేదని వాపోయాడు. తనకు పెళ్లి కాలేదని, తాను పనిచేస్తున్న ఇళ్లవారు ఇప్పటి వరకు తనను అనుమానించలేదని చెప్పుకొచ్చాడు. ఎప్పుడో ఒకప్పుడు విషయం బయటపడుతుందని తనకు తెలుసని, అయినప్పటికీ తన పరిస్థితి తెలిసిన తర్వాత ఎవరూ తనను పనిలోంచి తీసేయరన్న నమ్మకం ఉందని రాజా పేర్కొన్నాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos