ఈ దేవాలయాల్లో పురుషులకు నిషేధం..

  • In Tourism
  • October 10, 2019
  • 242 Views
ఈ దేవాలయాల్లో పురుషులకు నిషేధం..

సనాతన హిందూ మతంలో ఆధ్యాత్మకతకు,దైవారాధనకు ప్రథమ స్థానం ఉంటుంది.అందుకే భారతదేశంలో వేల సంఖ్యలో దేవాలయాలు దర్శనమిస్తాయి.వాటిలో కొన్ని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయి కూడా.అయితే కొన్ని దేవాలయాల్లో బయటి ప్రపంచానికి తెలియని నియమ నిబంధనలు కొంత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.శబరిమళ పైకి మహిళల ప్రవేశాన్ని నిషేధించినట్లే కొన్ని దేవాలయాల్లో పురుషుల ప్రవేశం నిషేధం అమలులో ఉంది.దశాబ్దాలుగా ఈ దేవాలయాల్లో పురుషులకు ప్రవేశం లేదంటే నమ్మి తీరాల్సిందే.మరి పురుషులకు ప్రవేశం నిషేధించిన దేవాలయాల గురించి ఓ లుక్కేద్దాం..
అటుకుల్ దేవాలయం..

కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉన్నఅటుకుల్ దేవాలయంలోకి సంక్రాంతి సమయంలో పురుషులు ప్రవేశించడం నిషేధం.పురుషుల ప్రవేశం నిషేధంపై స్థానికంగా కొన్ని విభిన్న కథలు ప్రచారంలో ఉండడంతో ఈ విషయంపై ఎటువంటి సమాధానం లభించడం లేదు. పార్వతీ దేవి స్వరూపంగా కొలిచే కన్యకాపరమేశ్వరి దేవాలయంలో మూడు రోజుల పాటు నిర్వహించే సంక్రాంతి పర్వదినాల్లో మగవారికి ప్రవేశం నిషేధం.సంక్రాంతి నిర్వహించే మూడు రోజుల పాటు పూజాది కార్యక్రమాలన్నీ మహిళలే నిర్వహిస్తారు. ఈ మూడు రోజుల్లో ఈ ఆలయాన్ని దాదాపు 30 లక్షల మంది భక్తులు సందర్శిస్తారు.ఈ భక్తులంతా మహిళలే కావడం గమనార్హం.ఈ దేవాలయం మరో ప్రత్యేకత చెప్పుకోవాలంటే ఇక్కడ నిర్వహించే సంక్రాంతి సంబరాలు గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించుకున్నాయి..

అటుకుల్ దేవాలయం


మాతా దేవాలయం..

బిహార్ రాష్ట్రంలోని ముజఫర్ పూర్ ప్రాంతంలో ఉన్న మాతా దేవాలయంలోకి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పురుషుల ప్రవేశించడాన్ని నిషేధించారు.దుర్గాదేవి స్వయంగా వెలసిందని భావించే ఈ దేవాలయంలో అటువంటి ప్రత్యేక సందర్భాల్లో అమ్మవారి పూజా కార్యక్రమాలను మహిళలే భక్తిశ్రద్ధలు,నియమి నిష్టలతో చేస్తారు.ఆ సమయంలో మహిళలు కఠిన నియమాలను పాఠిస్తూ పరమ పవిత్రంగా ఉంటారు.ఆ సమయంలో దేవాలయంలోకి ప్రవేశం నిషేధం విధించడంతో మగవారు ఆ దేవాలయం దరిదాపుల్లోకి కూడా వెళ్లరు. ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఊరి పెద్దల సమక్షంలో కఠిన శిక్ష ఎదుర్కొనాల్సి వస్తుంది.

మాతా దేవాలయం


దేవీ కన్యాకుమారి…

తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో ఉన్న దేవి కన్యాకుమారి దేవాలయాన్ని శక్తి పీఠాల్లో ఒకటిగా భావిస్తుంటారు.స్థానిక పురాణాల ప్రకారం సతీదేవి మరణానంతరం దుఃఖ సాగరంలో మునిగిన శివుడు సతీదేవి పార్థివ దేహంతో కైలాసానికి వెళుతుండగా సతీదేవి వెన్నుమక విరిగిపడి శక్తిపీఠంగా మారిందని చెబుతారు.పార్వతీదేవి అంశంతో ఇక్కడ వెలసిన అమ్మవారిని దేవి కుమారి లేదా కన్యాకుమారిగా పిలుస్తుంటారు.కన్య అంటే పెళ్లి కాని స్త్రీ అని అర్థం కావడంతో ఈ దేవాలయంలోకి పురుషులకు నిషేధం విధించారు.అయితే సన్యాస్యం స్వీకరించిన పురుషులు మాత్రం అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు.

దేవీ కన్యాకుమారి


బ్రహ్మ దేవాలయం..

రాజస్థాన్ రాష్ట్రంలోని పుష్కర్ అనే గ్రామంలో త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మ దేవుడికి గుడి ఉంది.ఈ గుడిలోకి పురుషుల ప్రవేశాన్ని నిషేధించారు.అందుకు కారణాల గురించి ఆరా తీయగా బ్రహ్మ దేవుడు సతీసమేతంగా చేపట్టిన యాగానికి బ్రహ్మ దేవుడి భార్య సరస్వతి అనుకున్న సమయానికి యాగానికి చేరుకులేకపోయే సరికి సమయం మించి పోతుండటంతో బ్రహ్మ దేవుడు గాయిత్రి దేవిని వివాహమాడి యాగం ప్రారంభించాడు.కొద్ది సేపు తర్వాత వచ్చిన సరస్మతి కోపం పట్టలేక ఈ యాగ ప్రాంతం పుణ్యక్షేత్రంగా మారినా ఇక్కడకు భక్తులు ఎవరూ రాని ఒకవేళ వస్తే తీవ్ర ఇబ్బందులు పడుతారని శాపం పెడుతుంది. దీంతో బ్రహ్మతో పాటు దేవతులు సరస్వతిని శాంతింపచేయడంతో కేవలం పెళ్లి కాని బ్రహ్మచారులకు మాత్రమే ఇది వర్తిస్తుందని సరస్పతి చెప్పిందని స్థల పురాణం. దీంతో అప్పటి నుంచి ఈ క్షేత్రంలో పెళ్లికాని మగవారికి ప్రవేశం నిషేధం విధించారని చెబుతారు..

బ్రహ్మ దేవాలయం


చక్కుల తుకావు..

కేరళ రాష్ట్రంలోని అల్ఫుజా గ్రామంలో దుర్గా మాత అవతారంలో ఉన్న చక్కుల తుకావు దేవాలయంలోకి కూడా మగవారికి ప్రవేశం నిషేధించారు.అయితే ఈ నిషేధం కేవలం రెండు ప్రత్యేక పూజలు నిర్వహించే సమయంలో మాత్రమే అమలవుతుంది.ప్రతీ సంవత్సరం నిర్వహించే నారీ పూజ, ధనుపూజ సమయంలో మాత్రమే పురుషులకు నిషేధం విధిస్తారు. నారీ పూజా సంక్రాంతి సమయంలో చేయగా ధను పూజ ధనుర్మాసంలో చేస్తారు. మొదటిది ఏడు రోజుల పాటు చేస్తే, రెండోది పది రోజుల పాటు చేస్తారు. ఆ సమయంలో కొంతమందికి తప్ప మిగిలిన మగవారికి ప్రవేశం నిషిద్ధం. ఆ సమయంలో ఆ దేవాలయంలో జరిగే ప్రతి పనిని మహిళలే చేస్తారు.

చక్కుల తుకావు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos