త్రివర్ణ పతాకాన్ని కాషాయ పతాకంగా మార్చాలనుకుంటున్నారు

త్రివర్ణ పతాకాన్ని కాషాయ పతాకంగా మార్చాలనుకుంటున్నారు

జమ్ము : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ మండి పడ్డారు. ‘మన జాతీయ జెండా అయిన త్రివర్ణ పతాకాన్ని కాషాయ పతాకంగా మార్చేందుకు బీజేపీ యత్నిస్తోంది. భారత రాజ్యాంగ పునాదులను, సెక్యులరిజంను కూడా బీజేపీ నాశనం చేస్తుంది. భారత్ ను మతపరమైన దేశంగా మార్చాలనుకుంటోంది. జమ్మూ కశ్మీర్ కు ఉన్న ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక ప్రతిపత్తి, ప్రత్యేక జెండాను తొలగించిన విధంగానే… త్రివర్ణ పతాకాన్ని కూడా మార్చేస్తారు. మేము మళ్లీ అధికారంలోకి వస్తే జమ్మూ కశ్మీర్ రాజ్యాంగాన్ని, ప్రత్యేక ప్రతిపత్తిని వెనక్కి తీసుకొస్తాం. కశ్మీర్ కోసం లక్షలాది మంది ప్రాణాలను త్యాగం చేశారు. మేము అధికారంలోకి వస్తే కశ్మీర్ సమస్యను పరిష్కరించాలని ఒత్తిడి తెస్తాం’ అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos