దురుద్దేశంతోనే ‘ఇంగ్లీష్’ బోధనను తప్పుబడుతున్నారు

దురుద్దేశంతోనే ‘ఇంగ్లీష్’  బోధనను తప్పుబడుతున్నారు

విజయవాడ: ‘రాజకీయ దురుద్దేశంతోనే ఇంగ్లీష్ మీడియంను తప్పుబడుతున్నార’ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఇక్కడ విమర్శించారు. సోమవారం ఇక్కడ జరిగిన మౌలానా అబుల్ కలాం జయంత్యుత్సవంలో ఏపీజే అబ్దుల్ కలాం విద్యా పురస్కారాల్ని ఉత్తమ ఉపాధ్యాయులు, విద్యార్థులకు వితరణ చేసిన తర్వాత ప్రసంగించారు. ఇంగ్లీష్ మాధ్యమ బోధనను విమర్శించిన వారి పై ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. ‘రాజకీయ దురుద్దేశంతోనే ఇంగ్లీష్ మీడియంను తప్పుబడుతు న్నారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు, వెంకయ్యనాయుడు లాంటి వాళ్లు ఇంగ్లీష్ మాధ్యమాన్ని తప్పుబడుతున్నారు. వెంకయ్య నా యు డు మనవళ్లు ఏ స్కూల్లో చదువుతున్నారో చెప్పాలి..?. పేద పిల్లలు ఇంగ్లీష్ మాధ్యమంలో చదవకూడదా?’ అని ఎదురు దాడి చేసారు. ఇంగ్లీష్ మాధ్యమ బడుల్లో చదివితేనే పోటీ ప్రపంచంలో పిల్లలు గెలవగలరు. అందుకే ఇంగ్లీష్ ప్రవేశ పెడుతు న్నా మ’ని స్పష్టీకరించారు. వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీషు మాధ్యమం తప్పనిసరి. తెలుగు లేదా హిందీ రెండో భాషగా ఉంటుం ద న్నా రు. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీషుమాధ్యమంలోనే ఆ తర్వాత ప్రతి ఏడాది 7,8,9,10 నాలుగేళ్లలో పది వరకు అమలు చేస్తా మని తేల్చిచెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos