అందమైన ఎస్పీకి వరుడు దొరకడం లేదట..

అందమైన ఎస్పీకి వరుడు దొరకడం లేదట..

ఐఏఎస్‌,ఐపీఎస్‌ అధికారులంటే ఒకప్పుడు మధ్య వయస్కులు లేదా వయసు పైబడిన వ్యక్తులు ఉంటారనే భావన అప్పటి యువతలో నెలకొని ఉండేది.కారణం అప్పటి యువతకు ఐఏఎస్‌,ఐపీఎస్‌ అధికారుల గురించి తెలియకపోవడం అధికారులు సైతం యువతతో దూరంగా ఉండడమే. ఉమేష్‌చంద్ర తదితర కొంతమంది అధికారలు మినహా ఐపీఎస్‌,ఐఏఎస్‌ల గురించి జనాలకు పెద్దగా తెలిసేది కాదు.కానీ దశాబ్ద కాలంగా వచ్చిన ఐఏఎస్‌,ఐపీఎస్‌ అధికారులపై యువత ప్రత్యేకంగా ఆసక్తిని చూపుతోంది. చిన్నవయసులోనే ఐఏఎస్‌,ఐపీఎస్‌ అధికారులు బాధ్యతలు స్వీకరించి విధి నిర్వహణలో కఠినంగా ఉంటుండడంతో యువత యువ ఐఏఎస్‌,ఐపీఎస్‌ అధికారులపై ప్రత్యేక ఆసక్తి చూపుతుండడానికి కారణంగా నిలుస్తోంది.దీంతోపాటు సామాజిక మాధ్యమాలు, అంతర్జాలం,స్మార్ట్‌మొబైళ్లు మరింత అందుబాటులోకి వచ్చాక ఐఏఎస్‌,ఐపీఎస్‌ అధికారులను యువత మరింత ఫాలో కావడం మొదలుపెట్టింది.ఈ క్రమంలోనే అందమైన ఐఏఎస్‌,ఐపీఎస్‌ యువ మహిళ అధికారులకు యువకులు అభిమానులుగా మారిపోతున్నారు. వరంగల్‌ అమ్రపాలి,స్మిత సబర్వాల్‌,రోహిణి సింధూరి ఇలా చాలా మంది అందమైన ఐఏఎస్‌,ఐపీఎస్‌ అధికారులపై యువత అభిమానం పెంచుకుంటోంది.2012లో సివిల్స్‌లో టాపర్‌గా నిలిచిన ప్రస్తుత మెదక్‌ జిల్లా ఎస్పీ చందన దీప్తి కూడా ఇదేకోవలోకి వస్తారు.తెలివిలోనే కాదు అందంలోనూ ఏ మాత్రం తీసిపోదు. ఈమెని చూసి చూపు తిప్పుకోలేని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో! తెలంగాణలో ఇప్పుడున్న యువ అధికారుల్లో ఈమె ఎంతో ఉత్సాహంగా పని చేస్తారు. మెదక్ జిల్లా ఎస్పీగా జిల్లాలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టడం మాత్రమే కాదు జిల్లాలో నేరాల శాతాన్ని కూడా తగ్గించి ఉన్నతాధికారుల చేత శబాష్ అనిపించుకున్నారు.డిజిటల్ పోలీసింగ్ సంస్కరణలో భాగంగా సోషల్ మీడియా వేదికల్లో పోలీసులు యాక్టీవ్ ఉండేలా చేస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ జిల్లాలో శాంతి భద్రతలు అదుపులో ఉంచటంలో విజయవంతమయ్యారు.అంతే కాదు ఒక జిల్లా ఎస్పీగా కూడా తన వంతుగా అనేక సోషల్ మీడియా వేదికల్లో పాలు పంచుకుంటూ నిరుద్యోగులను, యువకులను ప్రోత్సహిస్తూ వారికి అనేక ఉత్తేజపరిచే సందేశాలు ఇస్తూ ఉంటారు. అందుకే చందనకు చాల తక్కువ సమయంలోనే యువతలో మంచి క్రేజ్, ఫాలోయింగ్ వచ్చేలా చేసింది.ఇప్పుడు చందన దీప్తి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు. కారణం లవ్ మ్యారేజ్ అంటే ఇష్టమని చందన దీప్తి చేసిన వ్యాఖ్యలు. ఒక యూట్యూబ్ ఛానెల్ చేసిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ లవ్ మ్యారేజ్ చేసుకోవటం అంటే చాల ఇష్టమని కానీ ఇంటర్నెట్ లో నాకు పెళ్లి అయినట్టుగా తప్పుడు వార్తలు పెడుతుండటంతో తనకు సరైన వ్యక్తి దొరకటం లేదని వ్యాఖ్యానించారు. తనకు కాబోయే వ్యక్తి ఈ తప్పుడు వార్తలు చదువుతుండటం వల్లే తనను పట్టుకోలేకపోతున్నారని సరదాగా వ్యాఖ్యానించారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos