27 ఏళ్ల దీక్షను విరమించనున్నరామ భక్తురాలు

27 ఏళ్ల దీక్షను విరమించనున్నరామ భక్తురాలు

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన నేపథ్యంలో తన దీక్షను విరమించారు 27 ఏళ్లుగా సాధారణ భోజనం స్వీకరించడం మానేసిన 81 ఏళ్ల భక్తురాలు దీక్షను విరమించారు.1992లో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం అయోధ్యలో రామమందిరం నిర్మించాలని అప్పటివరకు సాధారణ ఆహారం ముట్టుకోనని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్‌కు చెందిన ఊర్మిళా చతుర్వేది దీక్ష చేపట్టారు.అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 27 ఏళ్ల పాటు పాలు, పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నారు.అయోధ్యలో రామాలయం కట్టాలన్నదే తన కలని, దానికి మార్గం సుగమం అయ్యే వరకూ తాను దీక్ష వహిస్తానని స్పష్టం చేసిన ఊర్మిళ, ఇప్పుడు దీక్షను విరమించేందుకు సిద్ధమయ్యారు.తీర్పు అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో దీక్ష విరమించడానికి సిద్ధమయ్యారు.ఈ క్రమంలో దీక్ష విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos