మారుతిలో ఉత్పత్తి నిలిపివేత

  • In Money
  • September 4, 2019
  • 161 Views
మారుతిలో ఉత్పత్తి నిలిపివేత

ఢిల్లీ : ఆర్థిక మందగమనం ఛాయలు క్రమేపీ విస్తరిస్తుండడంతో ఆటోమొబైల్ రంగం తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. హర్యానాలోని మారుతి సుజికి ఇండియా లిమిటెడ్ రెండు రోజుల పాటు వాహనాల ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయించింది. గురుగ్రామ్, మనెసార్ ప్లాంట్లను ఈ నెల 7, 9 తేదీల్లో మూసివేయనున్నారు. ఆ రెండు రోజులను ఉత్పత్తి రహిత దినంగా ప్రకటిస్తారు. ఉత్పత్తి నిలిపివేత ప్రభావం తాత్కాలిక ఉద్యోగులపై మాత్రమే ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఆగస్టులో మారుతి సుజుకి అమ్మకాలు 33.7 శాతం తగ్గాయి. గతేడాది ఇదే నెలలో 1,58,189 యూనిట్లను విక్రయించగా, ఈ ఏడాది 1,06,413 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఆగస్టులో ఎగుమతులు కూడా 10.8 శాతం మేర పడిపోయినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos