మార్కెట్లకు బ్లాక్ ఫ్రైడే

మార్కెట్లకు బ్లాక్ ఫ్రైడే

ముంబై : స్టాక్ మార్కెట్లకు శుక్ర వారం ‘బ్లాక్’ ఫ్రై డే నమోదయింది. వ్యాపారం స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. అంతే కోలుకో లేదు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పతనమవుతుందనే భయాందోళనలు మదుపర్లను ప్రభావితం చేసింది. సెన్సెక్స్ 1,020 పాయింట్లు కోల్పోయి 58,098కి, నిఫ్టీ 302 పాయింట్లు నష్టపోయి 17,327క దిగజారాయి. సెన్సెక్స్ లో సన్ ఫార్మా (1.53%), టాటా స్టీల్ (0.58%), ఐటీసీ (0.33%) దండిగా లాభాల్ని గడించాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-7.93%), మహీంద్రా అండ్ మహీంద్రా (-3.00%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.99%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.80%), బజాజ్ ఫైనాన్స్ (-2.73%) బాగా నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos