మార్కెట్ లకు లాభాల బోణి

మార్కెట్ లకు లాభాల బోణి

ముంబై: స్టాక్మార్కెట్ సోమవారం లాభాలతో వ్యాపారాల్ని ఆరంభించాయి. సెన్సెక్స్ పాయింట్ల 152 లాభంతో 34884 వద్ద, నిఫ్టీ 56 పాయింట్లు పెరిగి 10300 వద్ద ట్రేడింగ్ ఆరంభించాయి. భారీగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఉదయం గం.9:20ని.లకు సెన్సెక్స్ 300 పాయింట్లు పెరిగి 35033 వద్ద, నిఫ్టీ 92 పాయింట్ల లాభంతో 10337.05 వద్ద ఉన్నాయి. నిఫ్టీ ఇండెక్స్ 1శాతం లాభంతో 21556 వద్ద ట్రేడ్ అయ్యింది. కోవిడ్-19 వైరస్ వ్యాధిని అరికట్టేందుకు గ్లెన్మార్క్ సిప్లా, హెటిరో ఫార్మా సంస్థలు తయారు చేసిన ఔషధానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) అనుమతి లభించడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లో సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. బజాజ్ ఆటో, ఇండస్ఇండ్, బజాజ్ ఫైనాన్స్, సిప్లా, బజాజ్ ఫిన్ సర్వీసెస్ షేర్లు 2.50శాతం నుంచి 5.50శాతం లాభపడ్డాయి. హిందాల్కో, టీసీఎస్, ఎంఅండ్ఎం, టాటామోటర్స్, విప్రో షేర్లు అర శాతం నుంచి 2.50 శాతం నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos