ఇంవటివాడైన మనీశ్‌ పాండె..

  • In Sports
  • December 2, 2019
  • 53 Views
ఇంవటివాడైన మనీశ్‌ పాండె..

భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ మనీష్ పాండే సోమవారం పెళ్లి పెళ్లీపీటలెక్కాడు.చాలా కాలంగా సినీనటి అశ్రితను ప్రేమిస్తున్న మనీష్‌ సోమవారం ఆమెతో ముంబయిలోని ఓ హోటల్‌లో ఏడడుగులు వేశాడు.వివాహానికి కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, సన్నిహితుల మాత్రమే హాజరు కానున్నారని తెలుస్తోంది. భారత క్రికెట్ జట్టులోని కొద్దిమంది సభ్యులతో పాటు దేశీయ క్రికెటర్లు కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. గత కొన్నాళ్లుగా మనీష్ పాండే,అశ్రిత శెట్టి ప్రేమలో ఉన్నారు. ఎప్పటినుంచే ఈ జంట విందు వినోదాలు అంటూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. చివరి ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి ఈ రోజు పెళ్లి చేసుకుంటున్నారు. ముంబైకి చెందిన 26 ఏళ్ల అశ్రితతుళు భాషలో ‘తెళికెడా బొల్లి’ సినిమాతో 2012లో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ‘ఉదయం ఎన్‌హెచ్‌4’ ద్వారా తమిళ పరిశ్రమలో అడుగుపెట్టింది. ఇంద్రజిత్, ఓరు కన్నియం మూను కలవనికలం వంటి హిట్ చిత్రాలలో నటించింది. కర్ణాటక అద్భుత విజయం సాధించడంతో సోమవారం పెళ్లి చేసుకోబోతున్న కెప్టెన్‌ మనీశ్‌ పాండేకు జట్టు చక్కటి బహుమతిని అందించింది. ఆదివారం సూరత్‌లో మ్యాచ్ ఆడిన మనీశ్‌.. రోడ్డు మార్గం ద్వారా ముంబై చేరుకొని కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి వేడుకలో పాల్గొన్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ… ‘టీమిండియా తదుపరి సిరీస్ కోసం ఎదురు చూస్తున్నా. కానీ.. దీనికి ముందు, నాకు మరో ముఖ్యమైన సిరీస్ ఉంది. రేపు వివాహం చేసుకోబోతున్నా’ అని తెలిపాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos