మణిపూర్‌లో ఆగని హింసాకాండ

మణిపూర్‌లో ఆగని హింసాకాండ

ఇంఫాల్ : మణిపూర్లో గత తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న హింసాకాం ఇంకా చల్లారడం లేదు. ఈ హింసాకాండ ఇప్పట్లో అంతమయ్యే సూచనలు కూడా కనుచూపుమేర కనిపించడం లేదు. తాజాగా చరుచాంద్పూర్ జిల్లా హింసాకాండకు సాక్షిగా మారింది. చురుచాంద్పూర్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పి, డిప్యూటీ కమిషనర్తో సహా ఇతర ఉన్నతాధికారుల కార్యాలయాలు, నివాసాలపై గురువారం రాత్రి దాదాపు 300 నుంచి 400 మంది ఉన్న గుంపు దాడికి తెగబడింది. ఉన్నతాధికారుల నివాసాలు ఉండే ఈ ప్రాంతాన్ని మిని సెక్రటేరియట్గా పిలుస్తుంటారు. ఈ ప్రాంతంపై దాడికి పాల్పడ్డ గుంపు కలెక్టర్ నివాసాన్ని దగ్ధం చేశారు. అక్కడ నిలిపి ఉంచిన భద్రతా దళాల వాహనాలనూ అగ్నికి ఆహుతి చేశారు. గురువారం రాత్రి ముందుగా ఈ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన గుంపును గేట్ల వద్ద భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో భద్రతా సిబ్బందిపై రాళ్లదాడికి గుంపు పాల్పడింది. తరువాత ఈ గుంపు ఉన్నతాధికారుల నివాసాలు, కార్యాలయాల్లోకి ప్రవేశించి అక్కడ ఉన్న సామాగ్రిని దగ్ధం చేసింది. దీంతో గుంపును అక్కడ నుంచి చెదరగొట్టడానికి భద్రతా సిబ్బంది కాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. 12 మంది గాయపడినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ మృతులు, గాయపడిన సంఖ్యపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. శుక్రవారం తెల్లవారుజాము వరకూ కూడా ఈ హింసాకాండ, కాల్పులు కొనసాగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇటీవల సాయుధులతో కలిసి ఒక వీడియోలో కనిపించినందుకు చురచాంద్పూర్ జిల్లాలో కుకీ వర్గానికి చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్ను అధికారులు సస్పెండ్ చేశారు. దీనికి నిరసనగా ఈ కుకీ వర్గానికి చెందినవారే గురువారం రాత్రి దాడికి పాల్పడినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు.ఈ సస్పెండ్ ఘటనపై ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్ (ఐటిఎల్ఎఫ్) విడుదల చేసిన ఒక ప్రకటనలో ‘సాయుధులతో వీడియోలో కనిపించినందుకు కుకీ హెడ్కానిస్టేబుల్ను అధికారులు వేగంగా సస్పెండ్ చేశారు. అయితే ఇలాంటి వీడియోల్లో కనిపించే మైతేయి పోలీసులు, అధికారులపై ఎలాంటి చర్యలూ తీసుకోరు’ అని విమర్శించింది. మరోవైపు ఈ దాడి నేపథ్యంలో జిల్లాలో ఐదు రోజల పాటు మొబైల్ ఇంటర్నెట్, డేటా సేవలు, ఇంటర్నెట్ డేటా సేవలను నిలిపివేస్తూ మణిపూర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos