ట్రంప్ భార్య మెలానియా విగ్రహానికి నిప్పు

ట్రంప్ భార్య మెలానియా విగ్రహానికి నిప్పు

స్లోవేనియా: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భార్య మెలానియా స్వస్థలమైన స్లోవేనియాలో ఏర్పాటు చేసిన ఆమె దారు శిల్పాన్ని దుండగులు తగులు బెట్టారు. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం రోజునే ఆ చర్యకు పాల్పడినట్లు విగ్రహాన్ని తయారు దారుశిల్పి బ్రాడ్ డౌనీ తెలిపారు. విగ్రహం దెబ్బతిన్న విషయాన్ని ఆ తర్వాత రోజు పోలీసులు తనకు సమాచారం ఇవ్వడంతో దానిని తొలగించినట్లు వివరించారు. ఈ చర్య అమెరికాలో రాజకీయ చర్చకు కారణమవుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై అమెరికా ఇప్పటి వరకూ స్పందించలేదు. దర్యాప్తు పూర్తి సాగుతున్నందున ఎలాంటి వివరాలు వెల్లడించలేమని వాషింగ్టన్లోని మెలానియా కార్యాలయం పేర్కొంది. , స్లోవేనియాలో ఏర్పాటు చేసిన డొనాల్డ్ ట్రంప్ చెక్క విగ్రహాన్ని కూడా ఈ ఏడాది జనవరిలో కొందరు దుండగులు దహనం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos