మేజర్ అజయ్‌కృష్ణ రిపోర్టింగ్..

  • In Film
  • August 9, 2019
  • 144 Views
మేజర్ అజయ్‌కృష్ణ రిపోర్టింగ్..

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా సరిలేరు నీకెవ్వరు చిత్ర బృందం అభిమానుల కోసం చిత్రంలో మహేశ్‌బాబు పరిచయ సన్నివేశం టీజర్‌ను విడుదల చేసింది.సైన్యం దుస్తుల్లో మహేశ్‌బాబును పరచియం చేస్తూ అలా నడిచి వస్తున్న సన్నివేశం టీజర్‌కు హైలైట్‌గా నిలిచింది. మేజర్అజయ్కృష్ణ రిపోర్టింగ్అంటూ చిత్ర దర్శకుడు అనిల్రావిపూడి ట్వీట్చేశారు. ఆర్మీ మేయర్లుక్లో మహేశ్చాలా స్టైలిష్గా ఉన్నాడుసరిలేరు నీకెవ్వరు.. నువ్వేళ్లే రహదారికి జోహర్లు, ఎనలేని త్యాగానికి నువ్వే మారు పేరు అంటూ సాగే బ్యాగ్రౌండ్బిట్అభిమానులను ఆకట్టుకుంటుందిగతంలో ఎన్నడూ చూడని విధంగా ఈ చిత్రంలో మహేశ్‌బాబు సైనికాధికారిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుండగా చాలా ఏళ్ల విరామం అనంతరం విజయశాంతి చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ‘దిల్‌’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నట్టు చిత్ర బృందం ఇదివరకే ప్రకటించింది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos