తనకంటే 16 ఏళ్లు చిన్నదైన వైద్యురాలిని పెళ్లాడిన భగవంత్ మాన్

తనకంటే 16 ఏళ్లు చిన్నదైన వైద్యురాలిని పెళ్లాడిన భగవంత్ మాన్

చంఢిఘడ్ : పంజాబ్ సీఎం భగవంత్ మాన్(48) గురువారం ఇక్కడ తన నివాసంలో హర్యానాకు చెందిన గుర్ ప్రీత్ కౌర్(32)ను పెళ్ళాడారు. కొందరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం సిక్కు సంప్రదాయాల ప్రకారం జరిగింది. 2015లో భగవంత్ మాన్ మొదటి భార్య ఇందర్ ప్రీత్ కౌర్ కు విడాకులు ఇచ్చారు. వీరికి ఇద్దరు సంతానం. ఇందర్ ప్రీత్ కౌర్ తన పిల్లలు సీరత్ కౌర్ మాన్ (21), దిల్షాన్ మాన్ (17)లతో కలిసి అమెరికాలో ఉంటున్నారు. మొహాలీలో వైద్యురాలిగా ఉంటున్న డాక్ట ర్ గుర్ ప్రీత్ తో సీఎం భగవంత్ మాన్ కు చాన్నాళ్లుగా పరిచయం ఉంది. రెండు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం కూడా ఉంది. గత ఎన్నికల సమయంలోనూ మాన్ కు ఆమె ఎంతగానో సహకారం అందించారు. పెళ్లికి ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఏ ఒక్క పంజాబ్ మంత్రిని, ప్రముఖ నేతలను పిలవలేదని తెలుస్తోంది. అందుకే పెళ్లిలో ఎలాంటి రాజకీయ సందడి కనిపించలేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos