స్టాక్ మార్కెట్లకు నష్టాలు

స్టాక్ మార్కెట్లకు నష్టాలు

ముంబై: మదుపర్లు అమ్మకాలకు తెరతీయటంతో స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. తొమ్మిది ముక్కాలు గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 142 పాయింట్లు క్షీణించి 40,565, నిఫ్టీ 57 పాయింట్ల వెనకడుగుతో 11,880 వద్ద ఆగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 40,414 పాయింట్లు, నిఫ్టీ 11,854 పాయింట్ల దిగువన కనిష్టాలకు చేరాయి. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా భారీ సహాయక ప్యాకేజీని ప్రకటించే అంశంలో యూఎస్ కాంగ్రెస్లో కొనసాగుతున్న అనిశ్చితి ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటును బలహీనపరచినట్లు నిపుణుల మదింపు. దేశీ మార్కెట్లలో ఇటీవల నమోదైన ర్యాలీ కారణంగా ట్రేడర్లు లాభాల స్వీకరణ చేపడుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos