నష్టాల్లో విపణులు

నష్టాల్లో విపణులు

ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం ఊగిసలాటలో వ్యాపారాల్ని ఆరంభించాయి. స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9.56 గంటల సమయంలో సెన్సెక్స్ 09 పాయింట్ల స్వల్పలాభంతో 38,633 వద్ద, నిఫ్టీ మూడు పాయింట్లు లాభపడి 11,306 వద్ద ఉన్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.50 వద్ద దాఖలైంది. కరోనా భయాలు, ఫెడ్ వడ్డీ రేట్ల కోతతో అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియడం తదితరాలు దీనికి కారణంగా భావిస్తున్నారు. ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, భారతీ ఎయిర్టెల్, సన్ ఫార్మా షేర్లు లాభాల్ని గడించాయి.ఎస్ బ్యాంక్, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, వేదాంత నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos