గురువారమూ నష్టాలే

గురువారమూ నష్టాలే

ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారమూ నష్టాల పాలయ్యాయి. సెన్సెక్స్ 16 పాయింట్లు నష్టపోయి 37,830 వద్ద, నిఫ్టీ 19 పాయింట్లు నష్టపోయి 11,252 వద్ద ఆగాయి. మే13వ తేదీ తర్వాత ఇంతగా మార్కెట్లు నష్ట పోవటం ఇదే తొలిసారి. కార్పొరేట్ ఆదాయాలపై, హెచ్ఎన్ఏలపై పన్నులు విధించడం మార్కెట్లను కొంత ఇబ్బందికి గురి చేసింది. వృద్ధిరేటు తగ్గటమూ మదు పరుల భయానికి కారణమైంది. గురువారం ఉదయం ట్రేడింగ్ లాభాల్లో కొనసాగి చివరి 30 నిమిషాల్లో నష్టాల పాలైంది. నిఫ్టీలోని టాటామోటార్స్ అత్యధికంగా 4.8శాతం, బజాజ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, జేఎస్డబ్ల్యూ స్టీల్, భారత్ పెట్రోలియం, రిలయన్స్ ఇండస్ట్రీస్, యూపీఎల్, యస్బ్యాంక్ నష్ట పోయాయి. వేదాంత, సిప్లా, జీ ఎంటర్టైన్మెంట్, సన్ఫార్మా, ఇండస్ ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, యాక్సెస్ బ్యాంక్, పవర్ గ్రిడ్ లాభ పడ్డాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos