మిడతల దండుతో రైతుల గుబులు

మిడతల దండుతో రైతుల గుబులు

హోసూరు : కృష్ణగిరి జిల్లాలోని ఆంధ్రా సరిహద్దు గ్రామాల్లో మిడతల దండు ప్రవేశించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణగిరి జిల్లా వేపనపల్లి సమీపంలోని గ్రామా ల్లో ప్రస్తుతం మిడతల దండు చేరింది. పంట పొలాలతో పాటు ఆ ప్రాంతంలోని జిల్లేడు చెట్లు ,తంగేడు చెట్ల ఆకులను పూర్తిగా తినేశాయి . ఒక్క రోజులో ఈ మిడతల దండు ఆ ప్రాంతంలోని చెట్లు ఆకులు పూర్తిగా తినేయడం తో ఆందోళన చెందిన రైతులు వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కరోనా ప్రభావంతో జిల్లావ్యాప్తంగా అధికారులు అందరూ బిజీగా ఉన్న సమయంలో మిడతల దండు జిల్లాలోకి ప్రవేశించడంతో అధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు జిల్లా కలెక్టర్ ప్రభాకర్ సహా వ్యవసాయ శాఖ అధికారులు హుటాహుటిన నేరెలకెరి గ్రామానికి చేరుకుని మిడతల ప్రభావాన్ని నేరుగా వీక్షించారు. ఉత్తరాది రాష్ట్రాల నుండి క్రిష్ణగిరి ప్రాంతానికి వచ్చాయా లేక ఈ ప్రాంతంలోని మిడతలా అని అధికారులు వాటి గురించి తెలుసుకునే పనిలో పడ్డారు. నేరెలకెరి గ్రామంలో అరటి, క్యాబేజీ తదితర వాణిజ్య పంటలపై మిడతలు ఉండడం చూసిన అధికారులు వాటి ప్రభావాన్ని తగ్గించేందుకు రైతులకు పలు సూచనలు చేశారు. ఏది ఏమైనా ఆంధ్రా సరిహద్దు ప్రాంత గ్రామాలలో మిడతల దండు ప్రవేశించడం రైతులను ఆందోళనకు గురి చేసింది. సరిహద్దు గ్రామాల్లో సంచరిస్తున్న మిడతలు వలస వచ్చిన మిడతలు కావని అధికారులు తెలిపారు. వీటివల్ల రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని అధికారులు భరోసా ఇచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos