లాక్ డౌన్ తరువాతి వ్యూహం?

లాక్ డౌన్  తరువాతి వ్యూహం?

న్యూ ఢిల్లీ: లాక్ డౌన్ తరువాత కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ఏ వ్యూహంతో వెళ్లనుందని సుమారు 800 మంది విద్యా వేత్తలు, ఆరోగ్య రంగ నిపుణులు కేంద్రాన్ని లిఖిత పూర్వకంగా ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకోబోయే ముఖ్యమైన నిర్ణయాల గురించి ముందే వెల్లడించాలని కోరారు. లాక్ డౌన్ తాత్కాలిక పరిష్కారమే. ఆరోగ్య పరిరక్షణ గురించి ఆలోచించు కునేందుకు సమయాన్ని ఇచ్చింది. లాక్ డౌన్ తరువాత సమాజం ముందున్న సవాళ్లకు ఇంకా సమాధానాలు లేవు. దీర్ఘకాలిక దృక్పథంతో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది’ అని బెంగళూరు లోని ఐసీటీఎస్ ప్రతినిధి సువ్రత్ రాజు అభిప్రాయపడ్డారు. ‘వైరస్ కు లాక్ డౌన్ ను చికిత్సగా భావించరాదు. దేశంలో వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. ఈ మహమ్మారి మరింతగా విజృంభిస్తుంద’ని హెచ్చరించారు. ‘భౌతిక దూరాన్ని పాటించడం మంచి నిర్ణయమే అయినా, అదొక్కటే సరిపోదు. ఇక ఇంతవరకూ కరోనా నివారణ కారయక్రమాన్ని కేంద్రం ప్రకటించక పోవడం అసంతృప్తిని కలిగిస్తోంది. లాక్ డౌన్ తరువాత మహమ్మారిపై ఎలా పోరాటం చేయాలో ముందే చెప్పాలిల’ని శాస్త్రవేత్తలు కోరారు. ఆ పత్రంలో ఐఐఎఫ్ఆర్, ఎన్సీబీఎస్ శాస్త్రవేత్తలు ఐఐటీయన్లు, ఐఐఎస్ఈఆర్, ఐఐఎస్సీ ప్రతినిధులు, ఇండియన్ డాక్టర్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్ మెంట్ ప్రతినిధులు సంతకాలు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos