పాలీహౌస్ రైతులకు రుణ మాఫీ : వెంకటాచలపతి వినతి

పాలీహౌస్ రైతులకు రుణ మాఫీ : వెంకటాచలపతి వినతి

హొసూరు : లాక్ డౌన్ కారణంగా హోసూరు ప్రాంతంలో తీవ్రంగా నష్టపోయిన పాలీహౌస్ రైతులను ఆదుకోవాలని కృష్ణగిరి జిల్లా హార్టికల్చర్ ఫెడరేషన్ అధ్యక్షులు వెంకటాచలపతి ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో కోరారు. కృష్ణగిరి జిల్లా హోసూరు ప్రాంతంలో సుమారు రెండు వేల ఎకరాలకు పైగా పాలీహౌస్ లలో రైతులు వ్యవసాయం చేస్తున్నారు పాలీహౌస్ లలో రోజా, కార్నేషన్ జర్బరా తదితర పూల రకాలే కాక క్యాప్సికం, బీన్స్ తదితర వాణిజ్య పంటలను కూడా ఎక్కువగా సాగుచేస్తున్నారు. కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో తమిళనాడు రాష్ట్రంలో కూడా కొనసాగుతున్నది. లాక్ డౌన్ కారణంగా పాలీహౌస్ లో పండిస్తున్న వాణిజ్య పంటలను ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు రవాణా ఆగిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. బ్యాంకులలో రుణాలు పొంది పాలీహౌస్ లలో సేద్యం చేసి రుణాలు తిరిగి చెల్లించారు. 80 శాతం రైతులు రుణాలు బ్యాంక్ లకు చెల్లించగా, 20 శాతం మంది రైతులు చెల్లించవలసి ఉందని, ఈ తరుణంలో లాక్ డౌన్ ప్రకటించడం వల్ల రైతులు తీవ్రంగా నష్ట పోవడమే కాక బ్యాంకు రుణాలను తిరిగి చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు ప్రధానికి రాసిన లేఖలో వెంకటా చలపతి పేర్కొన్నారు. బ్యాంకు రుణాలను చెల్లించలేని రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేసి పాలీహౌస్ రైతులకు కొత్తగా ఎక్కువ రాయితీలతో రుణాలు మంజూరు చేసే విధంగా ప్రధాని చర్యలు చేపట్టాలని ఆయన ఆ లేఖలో కోరారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి రైతులను ఆదుకునే విధంగా  ముందుకు రావాలని వెంకటా చలపతి ఆ లేఖలో కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos