రాష్ట్రాల కొత్త రుణాలు రూ. 3.75 కోట్లు

రాష్ట్రాల కొత్త రుణాలు రూ. 3.75 కోట్లు

ముంబై: కేంద్ర ప్రభుత్వం కష్ట కాలంలో మొండి చేయి చూపటంతో ఈ ఏడాది అన్ని రాష్ట్రాలూ బాండ్ల వేలం రూపంలో రూ. 3.75 కోట్ల మార్కెట్ రుణాలను పొందాయని కేర్ రేటింగ్స్ అధ్యయనం వెల్లడించింది. ఇది నిరుటితో పోలిస్తే 55 శాతం అధికం.ఆయా రాష్ట్రాల బడ్జెట్ల్లో మొత్తంగా ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రూ. 5.07 లక్షల కోట్ల మేర రుణాలు తీసుకోవచ్చు. ఆ మొత్తంలో 75 శాతాన్ని మొదటి ఆరు నెలల్లోనే సేకరించాయి. ఇది అంచనాలకు మించి 16 శాతం అధికం. అత్యధికంగా రుణాలు పొందిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్లు ఉన్నాయి. మొత్తం రుణాల్లో 52 శాతం వాటా వీటిదే. నిరుటితో పోలిస్తే అరుణాచల ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, మణిపూర్, ఉత్తర ప్రదేశ్లలో రుణాల పెరుగుదల 21 నుండి 34 శాతం మధ్య ఉంది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, నాగాలాండ్లలో రుణాలు వంద శాతం మేర పెరిగాయి. మధ్య ప్రదేశ్, మేఘాలయ, హర్యానా, అస్సోం, ఉత్తరాఖండ్, ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా, చత్తీస్గఢ్లలో రుణాల పెరుగుదల 50-100 శాతం మధ్య ఉంది. సిక్కిం-తెలంగాణ, జమ్ము-కశ్మీర్, కేరళ,రాజస్తాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, మిజోరంలలో రుణాల పెరుగుదల 23-36 శాతంమధ్య ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos