ఈ గ్రామ రహస్యం సైన్స్‌కే చుక్కలు చూపిస్తోంది..

  • In Tourism
  • October 15, 2019
  • 327 Views
ఈ గ్రామ రహస్యం సైన్స్‌కే చుక్కలు చూపిస్తోంది..

ఇళ్ల పరిసరాల్లో పాము తిరుగుతోందని తెలిస్తేనే వెన్నులో ఎటువంటి వారికైనా వెన్నులో వణుకు పుడుతుంది.అటువంటిది భారీ విషసర్పాలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయని తెలిస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే నాలుకపై తడి ఆరిపోతుంది.కానీ కర్ణాటక రాష్ట్రంలోని ఓ గ్రామంలో ప్రతి ఇంట్లో భారీ విషసర్పాలు నిర్భయంగా తిరుగుతుండడం పైగా గ్రామస్థులకు ఏమాత్రం హాని చేయకపోవడం వెనుక రహస్యం ఎవరికీ అంతు చిక్కడం లేదు.దావణగెరె జిల్లా పంచాయత్ పట్టణానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగేనహళ్లి గ్రామంలో ప్రతి ఇంట్లోనూ గుట్టల కొద్దీ విషసర్పాలు తిరుగుతుంటాయి.దాదాపు ప్రతి ఇంట్లోనూ తాచు పాములు సంచరిస్తూవుంటాయి.అయినప్పటికీ ఈ గ్రామంలో ఎవరూ త్రాచుపాములను చూసి భయపడరు.పాములు సైతం గ్రామస్థుల మధ్య యథేచ్చగా తిరుగుతుంటాయి.|

నాగేనహళ్లి గ్రామం


గ్రామంలో దాదాపు 70ఇళ్ళు వున్నాయి.ఆ గ్రామంలోని ఇళ్ళ వెంట,తోటల్లోనూ,పోదల్లోనూ, పొలాల్లోనూ భారీపరిమాణాల్లో వుండే తాచుపాములు నిరాటంకంగా సంచరిస్తూవుంటాయి.అయినా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా తమ పనుల్ని తాము చేసుకుంటూ ఉంటారు.విశేషం ఏంటంటే ఈ గ్రామంలో వున్న వారు గానీ ఈ గ్రామంలోకి వచ్చిన వారు గానీ కాటుకు గురికాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఈ ప్రాంతంలోని ప్రజలు చాలా సార్లు కొన్ని కారణాల వల్ల సర్పాలకాటుకు గురైనా వాళ్లకు ఏమీ కాలేదు.పాము కాటుకు గురైన వ్యక్తులు గ్రామంలో ఉన్నంత వరకు ప్రాణహాని ఉండదు కానీ కాటుకు గురయ్యాక గ్రామం పొలిమేర దాటితే మాత్రం క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలిపోతాయి.

సాధువు ఉన్న హనుమంతుడి గుడి..


దీని వెనుక దాగిఉన్న రహస్యం మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు. గ్రామంలో ఎవరినైనా ఒక సర్పం కరిస్తే ఆ సర్పాన్ని తీసుకుని ఆ వూరి స్మశానంలో వున్న యతీశ్వర మండపం దగ్గర ఉంచుతారు. అదేవిధంగా కాటుకు గురైన వ్యక్తులు మొదట దగ్గరలో ఉన్న హనుమాన్ ఆలయానికి వెళ్లి స్వామివారి తీర్ధం తీసుకుని మరునాడు ఉదయం వరకు ఆ గుడిలోనే గడుపుతారు. అంతే ఎక్కిన తాచు పాము విషం నిర్వీర్యం అయిపోయి వాళ్ళు క్షేమంగా బయటపడతారు.ఈ రహస్యాన్ని చేధించడానికి ఎంతో మంది హేతువాదులు,శాస్త్రవేత్తలు ఎంతగా ప్రయత్నించినా ఫలితం మాత్రం శూన్యమని చెబుతున్నారు..

ఇంట్లోనే తిరుగుతున్న పాములు..


ఇంట్లోనే తిరుగుతున్న పాములు..


చరిత్ర పరిశీలిస్తే..
చాలా కాలం క్రితం గ్రామంలో యతీశ్వరుడు అనే సాధువు స్వామికి సేవలు చేసుకుంటూ గ్రామంలో భిక్షాటన చేస్తూ ఉండేవాడట.ఈ క్రమంలో ఒకరోజు భిక్షాటనకు బయలుదేరగా ఆలయం సమీపంలోని పొదల్లో ఓ మగశిశువు ఉండడాన్ని గమనించి తనతో పాటు తీసుకెళ్లి పెంచుకోసాగాడట.అలా 12 ఏళ్లు గడిచాక ఒక రోజున పిల్లవాడిని గుడి దగ్గర విడిచి భిక్షం కోసం ఊర్లోకి వెళ్ళాడు.మధ్యాహ్నానికి భిక్ష తీసుకుని గుడి దగ్గరకు వచ్చిన సాధువుకి పాముకాటుకు గురై చనిపోయివున్న తన పెంపుడు బిడ్డ కనిపించాడు.తన పెంపుడు బిడ్డకు అకాలమృత్యువు కలిగించిన సర్పంమీద ఆ సాధువుకు విపరీతమైన ఆగ్రహం కలిగింది.అమోఘమైన తపశ్శక్తి కలిగిన ఆ సాధువు ఆగ్రహంతో నాగలోకాన్ని పరిపాలించిన నాగలోకాన్ని పరిపాలించిన నాగ రాజును శపించటానికి ప్రయత్నించాడు.ఆ విషయాన్ని పసిగట్టిన నాగరాజు కన్నుమూసి తెరిచేలోగా తన పరివారంతో సహా పాతాళలోకం నుండి ఆ సాధువున్న ప్రాంతానికి వచ్చి శపించబోతున్న ఆ సాధువు కాళ్ళమీద పడి తన జాతి పాము చేసిన పాపాన్ని క్షమించమని వేడుకున్నాడు.

నేటికి యథాతథంగా యతీశ్వరుడు నాటి రాళ్లు..


అంతేకాకుండా సర్పకాటుకి గురై చనిపోయిన భార్యని వెంటనే బతికించాడు.దీంతో శాంతించిన యతీశ్వరుడు ఇకపై ఈ గ్రామంలో పాములు యథేచ్చగా తిరుగుతాయని అంతేకాకుండా ఈ గ్రామంలో పాములు కాటేస్తే గ్రామంలో ఉన్నంత వరకు పాము విషం పని చేయదని కాటుకు గురైన వ్యక్తులు ఒకరోజు తరువాత ప్రాణాలతో బయటపడతారంటూ అన్నాడట.అయితే ఈ గ్రామపొలిమేరలు దాటంగానే చనిపోతారని షరతు విధించాడట.దీంతోపాటు ప్రజలు మాంసాహారం తినరాదని,సర్పాలను చంపకూడదని ఒక నియమాన్ని సైతం బండరాళ్లపై లఖించాడు..తెలిసిగానీ,తెలీకగానీ ఈ గ్రామంలోని వారు ఏ పామునైనా చంపినట్లయితే తీవ్రఫలితాలను ఎదుర్కోవాల్సివుంటుందని ఆ సాధువు తెలియచేశాడట.ఈ నేపథ్యంలో సాధువు ఆ గ్రామ సరిహద్దులపై నాలుగు బండ రాళ్ళను నాటి నాగరాజుతో చెప్పిన మాటలు,విధించిన షరతును స్వయంగా లిఖించాడు.ఈ మేరకు యతీశ్వరుడు నాటిన రాళ్లుగా చెప్పబడుతున్న నాలుగు బండరాళ్లు ఈనాటికి యధాతథగా నిలిచేవున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos