జార్ఖండ్ లో భాజపాకు ఎల్జీపి షాక్‌

న్యూ ఢిల్లీ:జార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో ఒంటరి పోరాటానికి తీర్మా నించిన లోక్ జన్శక్తి పార్టీ (ఎల్జేపీ) భాజపాను దెబ్బ కొట్టింది. 50 శాసన సభ స్థానాలకు పోటీ చేయనుంది. మంగళవారం సాయంత్రానికి అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ట్వీట్ చేశారు. భాజపా ఇప్పటికే 52 మంది అభ్యర్థుల్ని ఎంపిక చేసింది.జార్ఖండ్లో ఎల్జేపీ ప్రభావం లేకపోయినా మిత్రపక్షానికి వ్యతిరేకంగా పోటీకి దిగడం చర్చనీయాంశమైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos