లెనెవో కొత్త స్మార్ట్ ఫోన్లు

  • In Money
  • September 5, 2019
  • 148 Views
లెనెవో కొత్త స్మార్ట్ ఫోన్లు

ముంబై: చైనీస్ మొబైల్ తయారీ సంస్థ లెనొవో మూడు సరికొత్త స్మార్ట్‌ ఫోన్లను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. లెనొవో కే10 నోట్, లెనొవో జెడ్6 ప్రో, లెనొవో ఏ6 నోట్ అనే ఫోన్లను ప్రవేశపెట్టినట్లు కంపెనీ వెల్లడించింది. ఫ్లిప్కార్ట్ ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు. నలుపు, నీలం రంగుల్లో ఉండే ఏ6 నోట్ స్మార్ట్‌ ఫోన్ ధర రూ.7,999. 4జీబీ ర్యామ్, 64జీబీ అంతర్గత స్టోరేజ్ వేరియంట్ కే10 నోట్ ఫోన్ ధర రూ.13,999, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ.15,999, 8జీబీ, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ జెడ్6 ప్రో ఫోన్ ధర రూ.33,999.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos