రిటైర్‌మెంట్‌ను ప్రకటించిన మలింగ

  • In Sports
  • September 14, 2021
  • 118 Views
రిటైర్‌మెంట్‌ను ప్రకటించిన మలింగ

శ్రీలంక ఫాస్ట్‌ బౌలర్‌ లసిత్‌ మలింగ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌నుంచి రిటైరవుతున్నట్లు మంగళవారం ప్రకటించాడు. `టీ20కి గుడ్‌బై చెబుతున్నా. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి రిటైరవుతున్నా. నా ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. రాబోయే రోజుల్లో నా అనుభవాన్ని యువ క్రికెటర్లతో పంచుకుంటా’ అంటూ 38 ఏళ్ల మలింగ ట్వీట్‌ చేశాడు.

యార్కర్ల స్పెషలిస్ట్ గా పేరుగాంచిన మలింగ ఖాతాలో అనేక రికార్డులు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదు హ్యాట్రిక్‌లు నమోదు చేసిన ఒకే ఒక్క బౌలర్ మలింగానే. అంతేకాదు, వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లను రెండుసార్లు పడగొట్టిన రికార్డు కూడా మలింగ పేరిటే నమోదై ఉంది. ఐపీఎల్‌లో మలింగ ఇప్పటికీ అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు.
లంక క్రికెట్‌లో జరుగుతున్న ప్రచారం ప్రకారం… మలింగ అక్టోబరులో జరిగే టీ20 వరల్డ్ కప్ లో శ్రీలంక జట్టు కెప్టెన్సీని ఆశించాడు. అయితే, సెలెక్టర్ల నుంచి సానుకూల స్పందన రాకపోవడం, లంక క్రికెట్ బోర్డు యువకులకు పెద్దపీట వేస్తుండడం వంటి కారణాలతో ఇక తప్పుకోవడమే మేలని మలింగ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos