నారా లోకేష్ కంటే ఎన్టీఆర్ 100 రెట్లు సమర్థుడు..

నారా లోకేష్ కంటే ఎన్టీఆర్ 100 రెట్లు సమర్థుడు..

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు,తనయుడు నారా లోకేశ్‌తో పాటు ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులపై తెలుగు అకాడమీ చైర్‌ పర్సన్‌ లక్ష్మీపార్వతి తీవ్ర ఆరోపణలు,విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ భార్యగా ఇతర కుటుంబ సభ్యులు తనను ఎంతో మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఒక్క పదవి కూడా రాకుండా చేశారని మండిపడ్డారు. మహానుభావుడు స్థాపించిన పార్టీ నేడు దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉందని అన్నారు. ఇప్పుడు పార్టీలోకి కొత్తగా కుక్కమూతి పిందెలు వచ్చాయంటూ పరోక్షంగా లోకేశ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కుక్కమూతి పిందెకు ఏం తెలుసని పార్టీ లీడర్ గా చేశారని విమర్శించారు.లోకేశ్ వంటి అయోగ్యుడిని పార్టీపై చంద్రబాబు బలవంతంగా రుద్దారని ఆరోపించారు. ఎన్టీఆర్ వంటి మహోన్నత వ్యక్తి స్థాపించిన పార్టీకి లోకేశ్ నాయకుడా? అంటూ నిప్పులు కురిపించారు. విషయమై టీడీపీలో ఎంత మంది లోలోపల బాధపడుతున్నారో తమకు తెలుసని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.ఎన్నికల ముందు మనవడే తనపై దారుణమైన నిందను వేసేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. “నా వయసును కూడా చూడకుండా 60 ఏళ్లు దాటినదాన్ని కూడా ఇంత భయంకరమైన నింద వేసి అప్రదిష్ట పాల్జేయాలని చూస్తారా? 30 ఏళ్లప్పుడు లేనిది 60 ఏళ్ల వయసులో ఇంత దారుణమైనది సృష్టించారు. ఇంత నీచానికి పాల్పడినవాళ్లు నా బంధువులని ఎలా చెప్పుకుంటాను. నాకొద్దు వాళ్లతో బంధుత్వం! మనవడు లేడు, అల్లుడు లేడుఅంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్ కంటే ఎన్టీఆర్ చాలా బెటర్. ఎటు లేదన్న 100 రెట్లు బెటర్ పర్సన్ అనేసింది లక్ష్మిపార్వతి.జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ప్రజలను మెప్పించగలిగే నటనా చాతుర్యంతో పాటు మంచి వాక్ చాతుర్యం కూడా ఉందని చెప్పింది లక్ష్మిపార్వతి. సబ్జెక్టు మీద అతనికి కమాండ్ ఉంది. ఒక పర్ఫెక్ట్నెస్ ఉంది. ఇలా లోకేష్ కంటే ఎన్టీఆర్ లో ఎక్కువ క్వాలిటీస్ ఉన్నాయని తెలిపింది. లోకేష్ ఏదీ లేదు కదా.. రాసిచ్చేది ఒకటి ఇతను చెప్పేది ఒకటని ఎద్దేవా చేశారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos