పారిశ్రామిక నగరి హొసూరు కార్మికులకు శుభవార్త

హొసూరు : హొసూరుతో పాటు చుట్టు పక్కల పారిశ్రామికవాడల్లో పని చేస్తున్న వేల మంది కార్మికులకు శుభవార్త.  పారిశ్రామిక నగరమైన హొసూరులో కార్మిక న్యాయ స్థానం శుక్రవారం ప్రారంభమైంది. కృష్ణగిరి జిల్లా న్యాయమూర్తి  కళావతి కార్మిక న్యాయస్థానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1992 వరకు కార్మికులు తమ హక్కుల సాధన కోసం సేలం కార్మిక కోర్టులో కేసులు వేసి పోరాడే వారని గుర్తు చేశారు. తరువాత కృష్ణగిరి జిల్లా ఏర్పడిన తర్వాత కార్మికుల కోసం క్రిష్ణగిరిలో కోర్టు ఏర్పాటు చేసినట్లు తెలిపారు పారిశ్రామిక నగరమైన హొసూరులో కార్మికుల కోసం కోర్టు ఏర్పాటు చేయడం శుభ పరిణామమని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. హొసూరు నుంచి క్రిష్ణగిరిలోని కార్మిక కోర్టుకు వెళ్లి వచ్చే సమయం, శ్రమ కార్మికులకు ఇకమీదట తగ్గుతుందని చెప్పారు. కార్మికులు తమ హక్కుల సాధన కోసం ఈ కోర్టులో పోరాడవచ్చని తెలిపారు. ఇప్పటివరకు

288 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరగా పరిష్కరించడానికి చర్యలు చేపడతామని వెల్లడించారు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో కోర్టును ఏర్పాటు చేశామన్నారు. రూ.కోటి నలభై లక్షల ఖర్చుతో పక్కా భవనాన్ని నిర్మించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో హొసూరు న్యాయవాదులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos