కుష్బూ చేతిలో కమలం

కుష్బూ చేతిలో కమలం

న్యూఢిల్లీ : మాజీ సినీనటి కుష్బూ కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలగి భాజపాలో చేరనున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడినందుకు ఆమెను తొలుత జాతీయ అధికార ప్రతినిధి పదవి నుంచి అధిష్టానం తొలగించింది. దరిమిలా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు కుష్బూ ప్రకటించారు. కాషాయ తీర్థం పుచ్చు కునేందుకు ఆమె ఆదివారం రాత్రినే ఢిల్లీకి వచ్చారు. భాజపా పెద్దలతో మంతనాలు చేశారు. వారి ఆహ్వానం మేరకే ఆమె ఆ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. 2010లో అధికార పార్టీ డీఎంకే ద్వారా ఆమె రాజకీయ జీవితాన్ని ఆరంభించారు. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్లోకి ఫిరాయించారు. రాష్ట్రంలో, కేంద్రంలోనూ పార్టీ అధికారంలో లేనందున ఆమెకు ఎలాంటి పదవీ దక్కలేదు. 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయదలచారు. డీఎంకే-కాంగ్రెస్ పొత్తు వల్ల ఆమె కు పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఆమెను రాజ్యసభకు పంపుతామని ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చలేదు. రాహుల్ గాంధీ ఆశీస్సులు ఉన్నా గత శాసనసభ, లోఎక్సభ ఎన్నికల్లో పోటీ చేయలేక పోయారు. కాంగ్రెస్, డీఎంకే కూటమిగా కొనసాగడం, గతంలో డీఎంకేతో విభేదించి కాంగ్రెస్లోకి ఫిరాయించినందునే డీఎంకే ముఖ్యనేత ఒకరు కుష్బూకు అడ్డుతగిలినట్లు సమాచారం. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన కుష్బు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానాన్ని ప్రశంసించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos