కుంభమేళ నేడు పరిసమాప్తం

కుంభమేళ నేడు పరిసమాప్తం

ప్రయాగ్‌రాజ్‌: కుంభమేళా నేటితో ముగియనుంది. ఇప్పటివరకు 22 కోట్ల మంది త్రివేణి సంగమంలో పవిత్ర  స్నాన మాచరించినట్లు అధికారుల అంచనా. 49 రోజుల పాటు సాగిన  కుంభ మేళాకు ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. జనవరి 15న ప్రారంభమైన కుంభ మేళాలో ఇప్పటివరకూ మొత్తం 22 కోట్ల మంది స్నాన మాచరించారు. పుల్వామా దాడి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా దాదాపు 400 మంది కేంద్ర పారా మిలటరీ సిబ్బందిని మోహరించారు. కుంభమేళాలో ఈ రోజు మాత్రమే  60 లక్షల నుంచి కోటి మంది భక్తులు పుణ్యస్నానం ఆచరిస్తారని అంచనా. పొరుగు జిల్లాలైన కౌశంబి, ప్రతాప్‌గఢ్‌, ఫతేపూర్‌ జిల్లాల నుంచి అదనపు పోలీసు బలగాలను రప్పించారు. ప్రయాగరాజ్‌లో కుంభమేళా ప్రతి ఆరేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. ప్రతి 12 ఏళ్లకు మహాకుంభమేళాను యాత్రికులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌ రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో మూడు గిన్నిస్‌ రికార్డులు నమోదయ్యాయి.  10వేల మంది పారిశుద్ధ్య కార్మికులు నాలుగు రోజుల పాటు పరిశుభ్రతా చర్యలు చేపట్టడం. మార్చి 1న జరిగిన పెయింటింగ్‌ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో కళాకారులు పాల్గొనటం, ఫిబ్రవరి 28న 503 షటిల్‌ బస్సులలో యాత్రికులు కుంభమేళాకు చేరుకోవడం . గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సభ్యుల బృందం ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుని పరిశీలించి ఈ మేరకు ధ్రువీకరించారని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos