ప్రకృతి అందాల కోట కుమట..

  • In Tourism
  • November 11, 2019
  • 280 Views
ప్రకృతి అందాల కోట కుమట..

సముద్ర తీరాలు,పశ్చిమ కనుమలతో ఎల్లప్పుడూ పచ్చదనంతో ఆహ్లాదం పంచే ఉత్తరకన్నడ జిల్లాలో కుమట తప్పకుండా చూడాల్సిన మరో అద్భుతమైన పర్యాటక ప్రాంతం.చారిత్రక కట్టడాలు, సాంప్రదాయ సంస్కృతులు,అడవుల పచ్చదనం,రాతి నిర్మాణాలు,సముద్ర తీరాలు,పరవళ్లు తొక్కుతూ సాగరుడిలో లీనమయ్యే అఘనాషిని నదీ అందాలు ఇవన్నీ చూసి తరించాలే కానీ మాటల్లో చెప్పడం సాధ్యం కాదు.ట్రెక్కింగ్ ప్రియులకు,సాహస క్రీడల ప్రేమికులకు,ప్రకృతి ఆరాధకులకు కుమట చక్కటి ప్రదేశం.కుమటలో తప్పకుండా చాడాల్సిన ప్రదేశాల్లో శ్రీ కుంభేశ్వర, శంకర నారాయణ మరియు శాంతిక పరమేశ్వరి,మహాలస దేవాలయాలు.ప్ర్రాచీన శిల్ప కళా ఆకృతులకు నిలయంగా విరాజిల్లుతున్న ఈ ఆలయాల్లో మహాలస దేవాలయానికి ప్రత్యేక స్థానం ఉంది.శ్రీ మహాలస మహారాణి దేవాలయంగా కూడా పిలుచుకునే ఈ ఆలయాన్ని. క్రీ.శ. 1565 వ సంవత్సరంలో నిర్మించినట్లు తెలుస్తుంది.గోవా లోని వెర్నా నుండి కాంస్య విగ్రహాన్ని మోసుకవచ్చిన గౌరవ్ పేరు మీద అర్చకులు నిర్మించారు. ఈ మహాలస విగ్రహాన్ని అక్కడి నుండి ఒక మట్టి కుండలో పెట్టుకొని తీసుకొని వచ్చారని కథనం.రామాయణం, మాహాభారత కధలు సైతం ఆలయ గోడలపై అందంగా చెక్కారు.
మిర్జన్ కోట :
సుమారు 4. 1 హెక్టార్ల విస్తీర్ణంలో లాటరైట్ రాళ్ళతో నిర్మించిన మిర్జన్ ఫోర్ట్ ఎత్తైన బురుజులు, చక్కని శిల్ప కళా చాతుర్యం నిర్మించిన ఈ కోట ఒకప్పుడు అనేక యుద్దాలను చూసిందని చరిత్రకారులు చెప్పే మాట.ప్రస్తుతం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ కోటలో ప్రవేశ ద్వారాలు,దర్బార్ హాళ్లు,రహస్య మార్గాలు ముచ్చటగొలుపుతాయి.కోట లోపల హిందూ దేవతలు ప్రతిమలు, రాజుల కాలం నాటి నాణేలు, మట్టి కుండలు, యుద్ధ సామాగ్రి వంటివి ఎన్నో చూడవచ్చు.

మిర్జన్ కోట


మిర్జన్ కోట


కుమటా బీచ్ :
కుమటాలో అదే పేరుతో గల బీచ్, దారేశ్వర్ బీచ్, బడా బీచ్ లు అనే మూడు సముద్ర తీరాలు కూడా తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు.అందులో కుమటా బీచ్ తీరం వెంబడి రాతి నిర్మాణాలు, అఘనాషిని నది సముద్రంలో కలిసే దృశ్యాలను తిలకించవచ్చు.

కుమటా బీచ్


ధారేశ్వర్‌ బీచ్‌లో సూర్యాస్తమయం


కుమట సముద్ర తీరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న దారేశ్వర్ బీచ్ అద్భుత సూర్యోదయాలు, సూర్యాస్తమాలు కట్టిపడేస్తాయి. పొడవైన ఈ బీచ్ లో కాలినడకన నడుస్తూ ఒకవైపు అరేబియా సముద్రాన్ని, ఎదురుగా లైట్ హౌస్ ను మరోపక్క కొబ్బరిచెట్లు , వరి పంట పొలాలు చూడవచ్చు.

అఘనాషిని నది


ఒంపులు తిరుగూతు అఘనాషిని నది


ఎలా చేరుకోవాలి ?
కుమటా సమీప పట్టణాలుగా గోకర్ణ (32 కి. మీ ), మురుడేశ్వర్ ( 46 కి. మీ), భట్కల్ (56 కి. మీ) లు కలవు. బెంగళూరు నుంచి 468 కి. మీ ల దూరంలో, ఉడిపి నుంచి 146 కి. మీ ల దూరంలో మరియు మంగళూరు నుంచి 199 కి. మీ ల దూరంలో కుమటా ప్రదేశం ఉన్నది.బెంగళూరు నుంచి శిర్సి,కార్వార్ లేదా ఉడుపి,మంగళూరుకు చేరుకొని అక్కడి నుంచి కుమట చేరుకోవచ్చు.లేదా బెంగళూరు,మంగళూరు నుంచి రైలు మార్గం ద్వారా నేరుగా కుమట చేరుకోవచ్చు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos