కేసీఆర్ ఆలోచనను లీక్ చేసిన కేటీఆర్..

కేసీఆర్ ఆలోచనను లీక్ చేసిన కేటీఆర్..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలోనే ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరించబోతున్నారని.. మేరకు ఆయన మదిలో గొప్ప పథకం రూపుదిద్దుకోబోతోందని తెరాస కార్యాధ్యక్షుడు కేటీఆర్‌ చూచాయగా చెప్పుకొచ్చారు.సిరిసిల్లలో రూ.5 కోట్ల నిధులతో నిర్మించే ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.ఇప్పటికే విషయంలో గ్రౌండ్ వర్క్ పూర్తయ్యిందని కేటీఆర్ తెలిపారు.తెలంగాణలో ప్రతి ఒక్కరి ఆరోగ్యసమాచారాన్ని కొద్దిరోజులుగా ఏఎన్ ఎంలు ఆరోగ్య కార్యకర్తలు తెలంగాణ వ్యాప్తంగా సేకరించి ఆన్ లైన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి గ్రామాలు పట్టణాల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారి రోగాలను నిగ్గుతేల్చి మందులు చికిత్సలు అందించారు.ఇప్పుడు డేటాను మొత్తం క్రోడీకరించి వెబ్ సైట్ లో పెట్టి తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులకు యాక్సెస్ ఇస్తారట.. తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ప్రతీ పౌరుడికి ఉచిత చికిత్స అందించే గొప్పపథకాన్ని కేసీఆర్ రాబోయే ఏడాదిలోగా ప్రారంభించడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos