ఒక వ్యక్తి ప్రపంచ కుబేరుడు అయితే దేశ సంపద పెరగదు

ఒక వ్యక్తి ప్రపంచ కుబేరుడు అయితే దేశ సంపద పెరగదు

హైదరాబాదు: ‘ఒక వ్యక్తి ప్రపంచ కుబేరుడు అయినంత మాత్రాన దేశ సంపద పెరగదు. మరొక వ్యక్తికి కాంట్రాక్టు ఇచ్చినంత మాత్రాన జిల్లా బాగుపడద’ని మంత్రి కేటీఆర్ అన్నారు. అదానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిల పేర్లను ప్రస్తావించకుండా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తమకు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం కాదు… నల్గొండ ప్రయోజనాలే ముఖ్యం మోదీ గారూ అని ట్వీట్ చేశారు. గుజరాత్ కు గత ఐదు నెలల్లో రూ. 80 వేల కోట్ల ప్యాకేజీలు ఇచ్చారు. మా తెలంగాణకు కనీసం రూ. 18 వేల కోట్లు ఇవ్వలేరా? అని ప్రశ్నించారు. ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం మిషన్ భగీరథకి రూ. 19 వేల కోట్లను కేటాయించమని నీతి ఆయోగ్ సిఫారసు చేస్తే పెడచెవిన పెట్టారని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వ్యక్తికి రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టును ఇచ్చారని తప్పుబట్టారు. ఇప్పటికైనా మోదీ గారు నల్గొండ జిల్లాకు రూ. 18 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటిస్తే మునుగోడు పోటీ నుంచి తప్పుకుంటాం. దీనికి బీజేపీ సిద్ధమా? అని ప్రశ్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos