రైతులను చంపితే దేశభక్తులు.. సాయం చేస్తే దేశద్రోహులమా?

రైతులను చంపితే దేశభక్తులు.. సాయం చేస్తే దేశద్రోహులమా?

హైదరాబాదు : ‘సమస్యలపై ధర్నా చేస్తున్న రైతులను చంపినోళ్లు, కొవిడ్తో వీధిన పడిన కుటుంబాలను విస్మరించినోళ్లు దేశ భక్తులు. వారికి సాయం చేసిన వాళ్లు మాత్రం దేశద్రోహులా? ’అంటూ మంత్రి కేటీఆర్ ఎదురు ప్రశ్న వేశారు. ఇతరుల దేశభక్తిపై సర్టిఫికెట్ ఇవ్వడానికి ఈ మూర్ఖులకు ఏం అర్హత ఉందని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఉద్యమం చేస్తూ మృతిచెందిన రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.3 లక్షలు ప్రకటించడాన్ని సమర్థించు కున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటే తప్పా? అని నిలదీశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్య మంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం తరపున రూ.3లక్షల పరిహారాన్ని ప్రకటించింద. పరిహారాన్ని ప్రకటించింది. ‘ఇక్కడి రైతులను పట్టించుకోవడం లేదు.. కానీ ఢిల్లీలో చనిపోయిన రైతు కుటుం బాలకు పరిహారం అంద జేస్తున్నారు’ అని విపక్షాలు మండి పడుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos