శాంతించని కృష్ణమ్మ

శాంతించని కృష్ణమ్మ

విజయవాడ : ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిలో వరద పోటు తీవ్రమైంది. కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు నిండిపోవడంతో మంగళవారం ఉదయం నుంచి పులిచింతల ప్రాజెక్టులోని 17 గేట్లను ఎత్తివేసి దిగువన ప్రకాశం బ్యారేజీకి నీటిని వదులుతున్నారు. ప్రకాశంకు భారీ ఎత్తున వరద రావడంతో ప్రాజెక్టులో నీటి నిల్వ 12 అడుగులకు చేరింది. దీంతో 72 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని వదులుతున్నారు. జగ్గయ్యపేటలోని ముత్యాల, వేదాద్రి, రావిరాల గ్రామల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నాగార్జున సాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. దీంతో నదీ పరివాహక ప్రాంతంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 175 అడుగులు కాగా, సాగర్ గేట్లను పూర్తిగా ఎత్తడంతో ప్రస్తుతం 152 అడుగులకు చేరింది. సాగర్, శ్రీశైలం నుంచి వరద ఉదృతంగా ఉండడంతో పులిచింతల, ప్రకాశం బ్యారేజ్‌లలో నీటి నిల్వ గంట గంటకు పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టు పరిధిలోని ముంపు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. బ్యారేజీ వద్ద నీటి విడుదలను కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పరిశీలించారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos