25 ఏళ్ల తర్వాత…

25 ఏళ్ల తర్వాత…

నాగార్జున సాగర్‌ జలాశయం నుంచి కృష్ణమ్మ ఉరుకులు పరుగులు

అమరావతి : ఇదో అరుదైన దృశ్యం. రెండు పుష్కరాల తర్వాత ఈ మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. మహారాష్ట్ర మొదలుకుని కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తివేయడం 25 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. నాగార్జున సాగర్‌ నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్‌ ప్రకటించింది. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసింది. ముంపు గ్రామాలను ముందే గుర్తించి స్థానికులకు పునరావాసం కల్పించడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. మరో వైపు కృష్ణా నది ప్రధాన ఉప నదులైన తుంగభద్ర, భీమా నదులు ఉప్పొంగుతుండడంతో తుంగభద్ర, ఉజ్జయిని జలాశయాల గేట్లను ఎత్తివేశారు. వీటి ద్వారా శ్రీశైలం జలాశయంలోకి కూడా వరద నీరు ఉధృతి ఎక్కువ కావడంతో దీంతో పాటే నాగార్జున సాగర్‌ జలాశయం గేట్లను పూర్తిగా ఎత్తివేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos