తక్కువ ఇన్నింగ్స్‌లోనే…కోహ్లి రికార్డు

  • In Sports
  • September 2, 2021
  • 99 Views
తక్కువ ఇన్నింగ్స్‌లోనే…కోహ్లి రికార్డు

ఓవల్: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన మైలు రాయిని దాటాడు. అండర్సన్ వేసిన 18వ ఓవర్ చివరి బంతిని బౌండరీకి తరలించిన రన్ మెషీన్ కోహ్లి.. అంతర్జాతీయ క్రికెట్‌లో వేగంగా 23,000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్.. 522 ఇన్నింగ్స్లలో ఈ మార్కును చేరుకోగా, కోహ్లి 440 మ్యాచులు 490 ఇన్నింగ్స్‌లో 55.28 సగటుతో ఈ మైలురాయిని క్రాస్ చేశాడు. ఇందులో 70 శతకాలు, 116 అర్ధ శతకాలు బాదాడు.
ఆసీస్ మాజీ కెప్టెన్ రికి పాంటింగ్‌ 544 ఇన్నింగ్స్, దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్‌ జాక్ కలిస్ 551 ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని అందుకున్నారు. వీరి తర్వాత శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర(568 ఇన్నింగ్స్),  రాహుల్ ద్రవిడ్ (576), శ్రీలంక మాజీ కెప్టెన్ జయవర్ధనే(645) ఈ మైలురాయిని చేరుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos