అక్రమ నిర్మాణాల కూల్చివేత భారతంలో అతి పెద్ద విధ్వంసం

అక్రమ నిర్మాణాల కూల్చివేత  భారతంలో అతి పెద్ద విధ్వంసం

న్యూ ఢిల్లీ : ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో బీజేపీ నేతృత్వంలోని మున్సిపల్ కార్పొరేషన్లు చేపడుతున్న ఆక్రమణల వ్యతిరేక డ్రైవ్ను వ్యతిరేకించి జైలుకు వెళ్లేందుకు ఆప్ ఎమ్మె ల్యేలు సిద్ధంగా ఉండాలని కేజ్రీవాల్ సూచించారు. సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఢిల్లీలో ప్రజల షాపులు, ఇళ్లను బీజేపీ.. బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని తప్పుబట్టారు. ఢిల్లీలో 80 శాతం ఇండ్లు ఆక్రమణలోనే ఉన్నాయి. వాటన్నింటినీ కూల్చివేస్తే.. స్వతంత్ర భారత దేశంలో అది అతి పెద్ధ విధ్వంసమని అభివర్ణించారు. 63 లక్షల మంది ప్రజల ఇళ్లు, షాపులు కూల్చివేతకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఢిల్లీలో దాదాపు 50 లక్షల మంది అనధికార కాలనీల్లో, 10 లక్షల మంది ‘జుగ్గీల్లో’ నివాసం ఉంటున్నారని తెలిపారు. వారి ఇళ్లను కూల్చి వేస్తారా..? అని మండిపడ్డారు. ఢిల్లీలో శాంతి కాలనీలు, మురికి వాడలను తొలగించాలన్నది వారి(బీజేపీ) ఆలోచన అని పేర్కొ న్నారు. మురికివాడల్లో ఉన్నవారికి ఇళ్లు సమకూరుస్తామని చెప్పిన బీజేపీ దానికి బదులు ఇళ్లను కూల్చేస్తోందని ఎద్దేవా చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos