అవినీతి తహిశీల్దార్ నాగరాజు ఆత్మహత్య..

అవినీతి తహిశీల్దార్ నాగరాజు ఆత్మహత్య..

కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. గతంలో కోటి పది లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసి ఎసిబికి చిక్కిన నాగరాజు… చంచల్ గూడ జైల్లో ఉన్నాడు నాగరాజు. అయితే ఇవాళ ఉదయం జైల్లోనే ఆత్మహత్య తహశీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. నాగరాజు మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు. కాగా…మాజీ తహశీల్దార్ నాగరాజు కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. కీసర తహసీల్దార్ నాగరాజు పై నమోదైన రెండవ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది.దయరా గ్రామంలోని 48 ఎకరాల విలువైన భూమికి నకిలీ పత్రాలు సృష్టించి మ్యూటేషన్ చేసిన ఎమ్మార్వో…ఎమ్మార్వో తో పాటు ఈ కేసులో 9 మంది ని నిందితులుగా చేర్చింది ఏసీబీ. భూ యజమాని ధర్మారెడ్డి తో పాటు అతని కుమారుడు శ్రీకాంత్ రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ వెంకటేష్, కాంట్రాక్టర్ వెంకటేశ్వర రావు, జగదీశ్వర్ రావు, భాస్కర్ రావులను అరెస్ట్ చేసారు. పరారీలో మరో ఇద్దరు నిందితులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం జైల్లోనే ఆత్మహత్య నాగరాజు ఆత్మహత్య చేసుకోవడం అందరిని షాక్ కు గురిచేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos