దర్శకుడి కోసం ప్రత్యేక జీఓ..

దర్శకుడి కోసం ప్రత్యేక జీఓ..

మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తరలిన అనంతరం తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం దేశంలో బాలీవుడ్‌కు ధీటుగా అభివృద్ధి చెందింది.వేలాది మందికి ప్రత్యక్షంగా,పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది.తెలంగాణ విభజన సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని అనుమానాలు,భయాలు నెలకొన్నా వాటిని పటాపంచలు చేస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రాంతాలకు అతీతంగతా తెలుగు చలన చిత్ర పరిశ్రమపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు.అప్పుడప్పుడూ చిత్ర రంగ పెద్దలు,ప్రముఖులతో సమావేశమై చిత్ర రంగ స్థితిగతులు,సమస్యల గురించి తెలుసుకుంటున్నారు.కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌ సైతం చిత్ర పరిశ్రమ అభివృద్ధి చేతనైన సహాయసహకారాలు అందిస్తూనే ఉండడం ప్రతీ ఒక్కరికి తెలిసిన విషయమే.తాజాగా దర్శకుడు ఎన్‌.శంకర్‌కు స్టూడియో నిర్మాణానికి స్థలం కేటాయించి సీఎం కేసీఆర్‌ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అండగా ఉంటామని నిరూపించుకున్నారు.శంకరపల్లిలోని మోకిల్లలో స్టూడియో నిర్మాణానికి దర్శకుడు ఎన్‌.శంకర్‌కు ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ కేసీఆర్‌ జీఓ కూడా జారీ చేయడంతో చిత్ర పరిశ్రమ ప్రముఖులు కేసీఆర్‌పై హర్షం వ్యక్తం చేస్తున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos