కేసీఆర్‌కు ఎలక్షన్ కమిషన్ నోటీసులు

కేసీఆర్‌కు ఎలక్షన్ కమిషన్ నోటీసులు

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలలపై నోటిసులు జారీ చేసింది. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నోటీసులు ఇచ్చింది. గురువారం (18వ తేదీ) లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. గురువారం ఉదయం 11 గంటలలోగా కేసీఆర్ వివరణ ఇవ్వాల్సి ఉంది. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసీఆర్పై కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి కేసీఆర్కు ఈసీ నోటీసులు జారీ చేసింది. గతసారి కూడా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష పార్టీలపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని అప్పట్లో ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. కేసీఆర్, కేటీఆర్ కూ నోటీసులు జారీ చేసింది. తాజాగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అనుచిత వ్యాఖ్యలతో అన్ని రాజకీయ పార్టీలు ముందుకు వెళుతుండడంతో ఈసీ సీరియస్గా ఉంది. ఈ నేపథ్యంలో సిరిసిల్లలో కేసీఆర్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డిపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos