ఎమ్మెల్సీ క‌విత‌కు 14 రోజుల జ్యుడిషియ‌ల్ రిమాండ్

ఎమ్మెల్సీ క‌విత‌కు 14 రోజుల జ్యుడిషియ‌ల్ రిమాండ్

న్యూఢిల్లీ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కుమారుడి పరీక్షల దృష్ట్యా మధ్యంతర బెయిల్ కోరారు కవిత. కానీ ఈ పిటిషన్పై ఏప్రిల్ 1వ తేదీన విచారణ చేపడుతామని కోర్టు తెలిపింది. మరికాసేపట్లు కవితను తీహార్ జైలుకు అధికారులు పంపనున్నారు. రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచే కంటే ముందు కవిత మాట్లాడారు. తాను కడిగిన ముత్యంలా బటయకు వస్తానని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చు కానీ.. తన ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆమె పేర్కొన్నారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదని, పొలిటికల్ లాండరింగ్ కేసని విమర్శించారు. ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరాడని, మరో నిందితుడు అప్రూవర్గా మారాడని, మూడో నిందితుడు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి రూ.50 కోట్లు ఇచ్చాడు. తాను ఏ తప్పూ చేయలేదని, అప్రూవర్గా మారేది లేదని స్పష్టం చేశారు. క్లీన్గా బయటకు వస్తానని చెప్పారు. నేటితో ఈడీ కస్టడీ ముగియడంతో ఎమ్మెల్సీ కవితను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos