ఢిల్లీ వీధుల్లో భారత్, పాక్‌ పోరాటం

ఢిల్లీ వీధుల్లో భారత్, పాక్‌ పోరాటం

న్యూఢిల్లీ: శాసన సభ ఎన్నికలను ఢిల్లీ వీధుల్లో భారత్, పాక్ మధ్య పోరాటంగా భాజపా కపిల్ మిశ్రా చేసిన ట్వీట్ పై 24 గంట ల్లోగా నివేదిక ఇవ్వాలని ఢిల్లీ ఎన్నికల అధికారిని భారత ఎన్నికల ప్రధాన అధికారి శుక్రవారం ఆదేశించారు. కపిల్ మిశ్రాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 23న కపిల్ మిశ్రా చేసిన ట్వీట్ లో ‘ఫిబ్రవరి 8న ఢిల్లీ వీధుల్లో భారత్, పాక్ మధ్య పోరాటం జరగనుంద’ని అభివర్ణించారు. ‘ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పాక్ అనుకూల సమూహాలు మోహరించాయి. పాక్ ఇప్పటికే ఇందెర్ లోక్, ఛాంద్బాగ్లోకి చొచ్చుకొచ్చింది. నిరసనకారులు రహదార్లు, వివిధ ప్రాంతాల్ని దిగ్బంధనం చేసారు. పాఠశాలల సివేతలతో ప్రజలకు ఆటంకాలు కలిగిస్తున్నార’ని గురువారం తన ట్వీట్ గురించి విలేఖ రులకు వివరించారు.దీని గురించి ఎన్నికల సంఘానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఫిర్యాదు చేసింది. మోడల్ టౌన్ నియోజక వర్గం నుంచి పోటీలో దిగిన కపిల్ మిశ్రా తప్పుడు సమాచారాన్ని అఫిడవిట్లో పొందు పరిచారని ఆరోపించింది. ఆయన అభ్యర్థి త్వాన్ని రద్దు చేయా లని కోరింది. అరవింద్ కేజ్రీవాల్కు అత్యంత సన్నిహితుడైన కపిల్ మిశ్రాపై గతంలో ఫిరాయింపు వ్యతిరేక చట్టం కింద అనర్హత వేటు పడింది. అనంతరం ఆయన బీజేపీలో చేరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos