వర్మ చెప్పినట్లే చేశాడు..

వర్మ చెప్పినట్లే చేశాడు..

వర్మ చెప్పినట్లే కరెక్ట్ టైమ్కు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలోని మొదటి పాటను విడుదల చేశాడు. ఇందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి చూపించాడు. అలాగే అసెంబ్లీ సెషన్స్లో చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేపై జగన్ ఫైర్ అవడం కూడా ఉంది. వీటితో పాటు కేసీఆర్ను కలవడం సహా ఎన్నో సన్నివేశాలను పాటలో ఉంచాడు.రెండు కులాలను ఆధారంగా తీసుకుని వర్మ చేస్తున్న చిత్రమేకమ్మ రాజ్యంలో కడప రెడ్లు‘. రెండు కులాలను వాడకున్నప్పటికీ వివాదాస్పదం కాని సినిమానే చేస్తానని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో ఉండబోయే పరిస్థితిపై ప్రస్తుతం రాసుకున్న కథ ద్వారా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చెబుతున్నాడు.రాంగోపాల్ విడుదల చేసిన పాటపై మిశ్రమ స్పందన వస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు దీనికి మద్దతు తెలుపుతుండగా, చంద్రబాబు.. పవన్ ఫ్యాన్స్ మాత్రం పాటపై విమర్శలు చేస్తున్నారు..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos