కమ్మరాజ్యంలో కడపరెడ్లు తొలి పాట టీజర్..

  • In Film
  • August 8, 2019
  • 148 Views
కమ్మరాజ్యంలో కడపరెడ్లు తొలి పాట టీజర్..

వివాదాలు లేనిదే కనీసం ముద్ద కూడా దిగని నైజం తనదని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఇప్పటికే అనేకసార్లు రుజువు చేసుకున్న విషయం తెలిసిందే.ఎప్పుడూ ఎవరి ఒకరిపై విమర్శలు చేస్తూ ఏదో ఒక అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వివాదాలు సృష్టించుకొని మరీ వివాదాల్లో మునిగితేలే ఆర్జీవీ తాజాగా తెలుగు సినీ ప్రేక్షకులు,అభిమానలకు షాకిచ్చాడు.ఎన్నికలు ముగిసిన అనంతరం కమ్మరాజ్యంలో కడప రెడ్లు టైటిల్‌తో సినిమా తీస్తానంటూ ప్రకటించాడు వర్మ.అయితే వర్మ గతంలో కూడా ఇదేవిధంగా ప్రకటించి వాటిని గాలికొదిలేసిన చిత్రాలు కోకొల్లలు ఉండడంతో దీన్ని కూడా ప్రేక్షకులు తేలికకగా తీసుకున్నారు.అయితే ఎప్పుడు తీశాడో ఎలా తీశాడో తెలియదు కానీ చిత్రీకరణ దాదాపు 70 శాతానికి పైగా పూర్తయిందనేది ఫిల్మ్ నగర్ టాక్.కొత్త చిత్రం కమ్మరాజ్యంలో కడపరెడ్లు చిత్రం మొదటి పాట టీజర్‌ను శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు విడుదల చేయనున్నట్లు దర్శకుడు ఆర్జీవీ ప్రకటించాడు.దీంతో ఈ చిత్రంతో ఇంకెన్ని వివాదాలు సృష్టిస్తాడోనని ప్రజలు,రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos