ఇంటిపై శ్రీ రాముడి జెండాను తొలగించిన కమల్‌ నాథ్

ఇంటిపై శ్రీ రాముడి జెండాను తొలగించిన కమల్‌ నాథ్

ఢిల్లీ: మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ కాంగ్రెస్ను వీడి బీజేపీలోకి చేరబోతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. కమల్ నాథ్ తన ఇంటిపై ఎగురవేసిన శ్రీ రాముడి జెండాను తొలగించారు. ఢిల్లీలోని కమల్ నివాసంపై చాలా రోజులుగా “జై శ్రీ రామ్” అనే నినాదం రాసి ఉన్న జెండా ఉండేది. ఇవాళ దాన్ని తొలగించడం కొత్త చర్చలకు తావిస్తోంది. కమల్ నాథ్ కాంగ్రెస్ను వీడబోతున్నారనే వార్తలు రావడం.. ఇదే సమయంలో ఆయన ఢిల్లీలో పర్యటించడంతో వీటికి బలం చేకూరింది. ఆయన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి కాంగ్రెస్ పార్టీ పేరును తొలగించడంతో.. బీజేపీ అగ్రనాయకత్వాన్ని కమల్ నాథ్ కలుస్తారనే ఊహాగానాలు వినిపించాయి. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన తరువాత మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడి పదవి నుంచి తనను తొలగించడంపై కమల్ కలత చెందారు.
ఖండిస్తున్న కాంగ్రెస్..
కమల్ నాథ్ కాంగ్రెస్ ను వీడుతున్నారన్న వార్తలను ఆ పార్టీ ఖండిస్తోంది. ఆయనకు కాంగ్రెస్తో ఉన్న అను బంధా న్ని ఉటంకిస్తూ ఆ పార్టీ నేతలు కామెంట్లు చేస్తున్నారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చింద్వారా నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు కమల్ని తన మూడో కుమారుడు అని పిలిచారని.. అలాంటి కన్న తల్లిలాంటి పార్టీని కమల్ విడిచిపెట్టరని అంటున్నారు. చింద్వారా నుంచి కమల్ 9 సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఆయన పార్టీ మార్పుపై కుమారుడు జితు పట్వారీ స్పందించారు. మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని.. ఆయన కాంగ్రెస్ వాదినని తనతో చాలాసార్లు చెప్పారని.. చివరి వరకు కాంగ్రెస్తోనే ఉంటారని స్పష్టం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos