నటుడు విష్ణు విశాల్‌తో గుత్తా జ్వాల డేటింగ్..

నటుడు విష్ణు విశాల్‌తో గుత్తా జ్వాల డేటింగ్..

ప్రముఖ బ్యాడ్మింటన్స్టార్గుత్తా జ్వాల, తమిళ నటుడితో ప్రేమలో పడిందా? అవుననే అంటూ వారిద్దరూ కలిసున్న ఫొటోలను చూపిస్తోంది కోలీవుడ్‌. తమిళ నటుడు విష్ణు విశాల్తో గత కొంతకాలంగా గుత్తా జ్వాల డేటింగ్‌లో ఉందని తెలుస్తుండగా, ఇటీవలి కాలంలో వీరిద్దరి చిత్రాలూ సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి.తాజాగా, న్యూ ఇయర్ వేడుకల్లోనూ జంట కలిసి కాలక్షేపం చేసింది. తనను ముద్దాడుతున్న విష్ణు ఫొటోను జ్వాల, స్వయంగా సామాజిక మాధ్యమాల ఖాతాలో పోస్ట్ చేయడంతో అదిప్పుడు తెగ వైరల్ అవుతోంది. జ్వాలానే స్వయంగా ఫొటోను బహిర్గతం చేయడంతో, వీరిద్దరి ఎఫైర్ పై కామెంట్ల మీద కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.గతంలో గుత్తా జ్వాల మరో బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు చేతన్‌ ఆనంద్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత పలు విభేదాల కారణంగా ఈ జంట విడిపోయారు. వీరిద్దరూ విడిపోవడానికి టీమిండియాకు చెందిన ఓ మాజీ క్రికెటర్‌ అని రూమర్స్‌ వచ్చాయి. అయితే ఈ వార్తలను గుత్తా జ్వాలా కొట్టిపారేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos