న్యాయవాదులపై న్యాయమూర్తి ఆగ్రహం

న్యూఢిల్లీ : సీనియర్ న్యాయవాదుల వ్యవహార శైలి పట్ల అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగై (సీజేఐ)  అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా పిలిచినా వారు విచారణకు హాజరు కావడం లేదని తప్పుబట్టారు. ‘వ్యాజ్యాల్ని అత్యవసరంగా విచారణ చేపట్టాలంటే వారు అర్ధరాత్రి అయినా, అనంతరం రాత్రి రెండు గంటల వేళకైనా ఇక్కడే ఉంటారు. మేము పిలిస్తే మాత్రం వారు హాజరు కారు. కోర్టు నిర్దిష్టంగా కోరినా హాజరు కాకపోతే ఇంతకన్నా ఎక్కువగా ఏమీ చెప్పలేన’ని ఆక్రోశించారు. కర్ణాటక రాజకీయ సంక్షోభానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కుమార స్వామి ప్రభుత్వానికి ఆధిక్యత ఉన్నట్లు రుజువు చేయడానికి శాసన సభలో బల పరీక్ష నిర్వహించాలని కోరిన ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఆయన గురువారం ఈ కేసులో వాదనలు వినిపిం చేందుకు హాజరు కాలేదు. నిర్దిష్టంగా చెప్పినప్పటికీ రోహత్గి హాజరు కాకపోవడంపై సీజేఐ అసంతృప్తి వ్యక్తం చేశారు. కర్ణాటక శాసన సభలో బలపరీక్ష జరిగినందున తాము దాఖలు చేసిన వ్యాజ్యాల్ని ఉపసంహరించుకుంటామని ఈ శాసనసభ్యులు న్యాయస్థానానికి తెలిపారు. సభాపతి తరపున వాదనలు వినిపిస్తున్న అభిషేక్ మను సింఘ్వి, రోహత్గి గురువారం హాజరైతే తుది ఆదేశాలు జారీ చేస్తామని బుధవారం సీజేఐ చెప్పిన సంగతి తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos